ACB Investigates HMDA Former Director Sivabalakrishna : హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణపై(Siva balakrishna) ఏసీబీ దర్యాప్తు అయిదోరోజు విచారణ ముగిసింది. దర్యాప్తులో పలు విషయాలు రాబట్టారు. అక్రమ ఆస్తుల కూడబెట్టారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు శివ బాలకృష్ణకు చెందిన 16 చోట్లలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రూ.8,26,48,000ల విలువ గల ఆస్తులను గుర్తించారు.
ఏసీబీ కస్టడీకి శివబాలకృష్ణ - 15 బ్యాంకు ఖాతాల లవాదేవీలపై అధికారుల ఆరా
వీటి మార్కెట్ విలువ ప్రభుత్వ ధర కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం శివబాలకృష్ణ(Siva balakrishna )ను అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్(Judicial Remand)కు తరలించారు. 8 రోజుల కస్టడీకి అనుమతి పొంది, విచారణ కొనసాగిస్తున్నారు. మొదటి రోజు సోదాల్లో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లపై విచారణ చేసిన అధికారులు స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. బ్యాంకు లాకర్లు, బినామీల సంబంధాలపై ఆరా తీశారు.
ACB Raids on Sivabalakrishna : శివ బాలకృష్ణ పెట్టుబడుల రెండు ప్రముఖ ఇన్ఫ్రా కంపెనీల సంబంధాలు,అతని భార్య బంధువు భరత్ పేరుపై ఉన్న మూడు లాకర్లు గురించి వివరాలు తీసుకున్నారు. తొలిరోజు సహకరించకపోవడంతో రెండో రోజు అధికారలు తమ వద్దనున్న ఆధారాలను ప్రయోగించి నిజాలు రాబట్టే ప్రయత్నం చేశారు. మూడురోజు ఆరాలో శివబాలకృష్ణ బినామీలుగా ఏర్పాటు చేసుకున్న వారికి నోటీసులు పంపించారు.
ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న శివబాలకృష్ణ లీలలు - అజ్ఞాతంలోకి ఆ నలుగురు!
Sivabalakrishna Investigation Details :నాలుగో రోజు జరిగిన విచారణలో బినామీలతో పాటు ఏయే సంస్థల్లో శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టాడో విచారణ చేసినట్లు తెలిసింది. బాలకృష్ణ సోదరుడు శివసునీల్ కుమార్‌ను సైతం అధికారులు అవినీతి నిరోదక శాఖ కార్యాలయానికి పిలిచి విచారించారు. స్థిరాస్తి వ్యాపారాల వల్లనే ఇంత మొత్తంలో ఆదాయార్జన చేసినట్లుగా గుర్తించారు. బినామీలతో పాటు విలాసవంతమైన కార్లు తదితరమైనవి సమకూర్చుకునేందుకు నిధులు ఎక్కడినుంచి వచ్చాయనే కోణంలోనూ దర్యాప్తు జరిగింది. ఎనిమిది రోజుల కస్టడీ విచారణలో భాగంగా ఇప్పటికే అయిదు రోజుల విచారణ ముగిసింది. ఈరోజుతో కలిపి మూడు రోజులే సమయం మిగిలి ఉండడంతో అధికారులు మరింత గడువు కోరుతారా? లేదా? మిగిలిన విచారణలో పూర్తి స్థాయి వివరాలు రాబడతారా అనేది వేచి చూడాల్సి ఉంది.
చంచల్‌గూడ జైలుకు శివబాలకృష్ణ - బినామీలను విచారించడంపై ఏసీబీ ఫోకస్