ACB Arrest sheep Distribution Scam: బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన గొర్రెల పంపిణీ(sheep Distribution) అక్రమాల కేసులో అరెస్టులు మొదలయ్యాయి. గొర్రెల స్కాంలో కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నలుగురు పశుసంవర్ధక శాఖ అధికారులను అరెస్టు చేసిన అధికారులు ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్లు, ఒక డిప్యూటీ డైరెక్టర్, ఒక డిస్ట్రిక్ట్ గ్రౌండ్ వాటర్ ఆఫీసర్లలైన రవి, ఆదిత్య కేశవ సాయి, రఘుపతి రెడ్డి, సంగు గణేష్‌లను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
అనంతరం నాంపల్లి కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచారు. ప్రైవేట్ వ్యక్తులతో కలిసి బినామీ తెరిచిన పశుసంవర్ధన శాఖ అధికారులు రూ. 2.10 కోట్ల రూపాయల ప్రభుత్వ నిధులను నిందితులు మళ్లించుకున్నారు. విచారరించిన ఎసీబీ కోర్టు నలుగురు నిందితులకు జ్యూడిషల్ రిమాండ్ విధించింది. మార్చి 7 వరకు కోర్టు రిమాండ్ విధించడంతో నాంపల్లి నుంచి చంచల్‌గూడ జైలుకి అధికారులు తరలించారు.
గొర్రెల పంపిణీలో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణ నేపథ్యంలో ఏసీబీ అధికారులు గత కొద్ది రోజులుగా దర్యాప్తు చేస్తున్నారు. రికార్డుల పరిశీలన, బాధితుల నుంచి వివరాలను సేకరించి దర్యాప్తు చేపట్టారు. బినామీల పేర్లతో నిధులను దారి మళ్లించారనే కోణంలో ఆధారాలను సేకరించారు. ఈ కేసులో పశుసంవర్ధక శాఖ ఉన్నతాధికారులు, కాంట్రాక్టర్ల పాత్రలపైనా ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఇటీవల కాగ్ కూడా ఈ పథకంలో భారీగా అవకతవకలు జరిగాయని తన నివేదికలో పేర్కొంది.
గొర్రెల నిధుల గోల్‌మాల్‌పై ఏసీబీ లోతైన దర్యాప్తు - 2 కోట్ల నిధులకు పైగా దారి మళ్లినట్లు గుర్తింపు