ఆటోలో ఇంటికి వెళుతున్న యువతి - అత్యాచారం చేసిన ఆటో డ్రైవర్ - Women Raped by Auto Driver
Women Raped by Auto Driver at Secunderabad : సికింద్రాబాద్ ఆల్వాల్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న ఓ మహిళ అల్వాల్ నుంచి యాప్రాల్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ మహిళను వెంకట్రావుపేటలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరితో కలిసి ఆటో డ్రైవర్ అత్యాచారం చేశాడు.
Published : Jul 15, 2024, 10:51 AM IST
Women Raped by Auto Driver at Secunderabad : సికింద్రాబాద్ ఆల్వాల్‌లో ఓ మహిళపై సామూహిక అత్యాచారం ఘటన కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 12న ఓ మహిళ అల్వాల్ నుంచి యాప్రాల్‌లోని తన ఇంటికి వెళ్లేందుకు ఆటోలో ఎక్కింది. ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ మహిళను ఆటో డ్రైవర్ వెంకట్రావుపేటలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. అక్కడ మరో ఇద్దరితో కలిసి అత్యాచారం చేశాడు. నిందితుల నుంచి తప్పించుకొని ఆ మహిళ పోలీసులను ఆశ్రయించింది. మహిళ ఫిర్యాదు మేరకు బొల్లారం పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఈ కేసును ఆల్వాల్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. ఆల్వాల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.