Police Case on Hero Raj Tharun : సినీ నటుడు రాజ్‌తరుణ్ తనను ప్రేమించి మోసం చేశాడంటూ లావణ్య అనే యువతి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రాజ్‌తరుణ్, తాను 2012 నుంచి రిలేషన్లో ఉన్నామని, ఇటీవల అతడు మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్‌తో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని పేర్కొంది. 'తిరగబడరా సామి' అనే సినిమా షూటింగ్ జరిగినప్పటి నుంచి ఈ రిలేషన్ కొనసాగిస్తున్నట్లు తేలిందన్నారు. ఇదే విషయమై రాజ్‌తరుణ్‌ను నిలదీస్తే, తనను దుర్భాషలాడాడని ఫిర్యాదులో పేర్కొంది.
మాల్వి తండ్రి, సోదరుడు రాజ్‌తరుణ్‌ను వదిలేయాలని తనను బెదిరించారని ఫిర్యాదులో పేర్కొంది. సంబంధం లేని కేసులో తనను ఇరికించారని, దాంతో తాను 43 రోజులు జైల్లో ఉండాల్సి వచ్చిందని తెలిపింది. కాగా లావణ్య ఇచ్చిన ఫిర్యాదును నార్సింగి పోలీసులు స్వీకరించారు. ఈ విషయంపై ఇన్స్పెక్టర్ హరికృష్ట రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాజ్‌తరుణ్ తనను మోసం చేసి, మరో యువతితో సహజీవనం చేస్తున్నాడని లావణ్య ఫిర్యాదు చేశారన్నారు. తనపై బెదిరింపులకు దిగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారన్నారు. లావణ్య ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారాలు పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం ఫిర్యాదు చేసిన లావణ్య గతంలో ఓ డ్రగ్స్ కేసులో నిందితురాలుగా ఉన్నట్లు వెల్లడించారు.
రాజ్‌తరుణ్ స్పందన ఇదే : లావణ్య చేసిన ఆరోపణలపై హీరో రాజ్‌తరుణ్ స్పందించారు. లావణ్య, తాను గతంలో సహజీవనం చేశామని, రెండున్నరేళ్లు కలిసి జీవించామని తెలిపారు. లావణ్యను తను పెళ్లి చేసుకోలేదన్న రాజ్‌తరుణ్, 2017 నుంచి తనకు లావణ్యతో సంబంధం లేదన్నారు. లావణ్యకు డ్రగ్స్ అలవాటు ఉందని ఆరోపించారు. ఇప్పుడు లావణ్య మస్తాన్ సాయి అనే వ్యక్తితో సహజీవనం చేస్తోందని, మస్తాన్ మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు కూడా చేసిందని తెలిపారు.