తెలంగాణ

telangana

ETV Bharat / state

అమ్మ కోసం పెళ్లికి ఓకే చెప్పింది - ఆ కోరిక నెరవేరకుండానే వెళ్లిపోయింది - YOUNG WOMAN DIED IN ANANTHAPUR

తెల్లారితే నిశ్చితార్థం జరగాల్సిన ఇంట తీవ్ర విషాదం - రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పెళ్లి కుమార్తె - సోదరుడికి తీవ్ర గాయాలు - శోకసంద్రంలో మునిగిన తల్లిదండ్రులు

Geetha
మృతురాలు గీత (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Nov 17, 2024, 10:34 AM IST

Young Woman Died the Day before Her Engagement :ఆ అమ్మాయి బీటెక్​ కంప్లీట్ చేసింది. జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. మంచి ఉద్యోగం చేస్తూ ఉన్నతంగా, సంతోషంగా బతకాలని కలలు కన్నది. అయితే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న తల్లి కోరిక మేరకు పెళ్లి చేసుకునేందుకు సిద్ధపడింది. కుమార్తె ఓకే చెప్పడంతో తల్లిదండ్రులు ఓ మంచి సంబంధం చూశారు. తెల్లవారితే నిశ్చితార్థం. అందంగా కనిపించాలని చేతికి గోరింటాకు పెట్టించుకోవడానికి సోదరుడిని తీసుకుని పక్క ఊరికి వెళ్లింది. చేతినిండా గోరింటాకు పెట్టుకుని తిరిగి ఇంటికి బయలుదేరింది. మరికాసేపట్లో ఇల్లు చేరుతామనగా ఆ యువతిని మృత్యువు కబళించింది. సోదరుడు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ విషాద ఘటన కన్నవారిని శోకసంద్రంలో ముంచేసింది.

వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వెంకటరెడ్డిపల్లి గ్రామంలో నివసించే శ్రీరామ్‌ రెడ్డి, లక్ష్మీ దేవి దంపతులకు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు గీత, బిందు, ఒక కుమారుడు నారాయణ రెడ్డిలు ఉన్నారు. ఈ ముగ్గురినీ బీటెక్‌ చదివించారు. అయితే లక్ష్మీదేవి గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె కోరిక మేరకు పెద్ద కుమార్తె గీత (24)కు వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. విషయం బిడ్డకు చెప్పడంతో ఆమె కూడా ఓకే చెప్పింది.

పెళ్లికి గీత ఒప్పుకోవడంతో సంబంధాలు చూడటం ప్రారంభించారు. చివరకు ఓ మంచి కుటుంబంతో సంబంధం కుదరడంతో ఆదివారం (నవంబర్ 17) నిశ్చితార్థం ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చేతులకు గోరింటాకు పెట్టించుకునేందుకు గీత తన తమ్ముడు నారాయణ రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంపై పక్క ఊరైన తాడిపత్రికి వెళ్లింది. వెళ్లిన పని పూర్తి చేసుకుని తిరిగి గ్రామానికి బయలుదేరారు. ఊరి దగ్గరకు రాగానే ఎదురుగా వస్తున్న ఓ ట్రాక్టర్​ వీరి బండిని ఢీకొట్టింది.

ఆ ముచ్చట తీరకుండానే : ఘటనలో తీవ్ర గాయాలైన గీత అక్కడికక్కడే మృతి చెందగా, తమ్ముడు నారాయణ రెడ్డి తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబసభ్యులు అంబులెన్స్​లో తాడిపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అతడు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. తెల్లారితే నిశ్చితార్థం జరుగుతుందనగా, కుమార్తె చనిపోవడంతో పెళ్లి ముచ్చట తీరకుండానే వెళ్లిపోయావా తల్లీ అంటూ తల్లిదండ్రులు రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది. కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని గ్రామీణ సీఐ వెల్లడించారు.

పెళ్లింట విషాదం - కారు బోల్తా పడి పెళ్లి కుమార్తె తల్లి సహా ముగ్గురు మృతి - prakasam Road Accident

New Groom Died Electric Shock in Siddipet : పెళ్లింట విషాదం.. కరెంట్​ షాక్​తో నవ వరుడు మృతి

ABOUT THE AUTHOR

...view details