Young Man Died in Khammam :పొట్టచేత పట్టుకుని, కూలీ పనిచేసుకునేందుకు రాష్ట్రానికి వచ్చిన ఓ యువకుడు, ఫైనాన్స్(Private Finance) రికవరీ ఏజెంట్ల నుంచి తప్పించుకునే క్రమంలో చెరువులో మునిగి చనిపోయాడు. ఈఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెల్తే.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన వినయ్ అనే వ్యక్తి ఖమ్మం పట్టణానికి వలస వచ్చాడు. స్థానిక మూడో పట్టణ ప్రాంతంలో నివాసం ఉంటూ, మార్బుల్ పనిచేసుకుంటూ జీవిస్తున్నాడు.
లోన్ ఇప్పిస్తామని నమ్మబలికారు - మహిళల పేరిట ఖాతాలు తెరిచి రుణం తీసుకున్న కేటుగాళ్లు
పట్టణంలోని మోహన్ సాయి అనే ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ నుంచి వినయ్ రుణం తీసుకుని, ద్విచక్రవాహనం కొనుగోలు చేశాడు. అయితే ఫైనాన్స్ కిస్తీలు కట్టలేదని రికవరీ ఏజెంట్లు ప్రశ్నించారు. వారి నుంచి కొన్నిరోజులుగా తప్పించుకు తిరుగుతున్న వినయ్, శుక్రవారం మార్బుల్ పని నిమిత్తం బల్లేపల్లికి వెళ్లాడు. అతను అక్కడ ఉన్నట్లు తెలుసుకున్న రికవరీ ఏజెంట్లు, ఇంటి నిర్మాణ ప్రాంతానికి వచ్చారు.