తెలంగాణ

telangana

ETV Bharat / state

నన్ను మన్నించు కన్నా - కళ్లల్లో నీ రూపం నింపుకొని లోకం వీడుతున్నా - Woman dies due to electric shock - WOMAN DIES DUE TO ELECTRIC SHOCK

A woman Died Due to Current Shock in Mancherial District : ఆ దంపతుల కాపురం సజావుగా సాగిపోతోంది. వారి ఆన్యోన్య దాంపత్యానికి గుర్తుగా ఓ నాలుగుళ్ల బాబు ఉన్నాడు. కానీ ఇంతలోనే వారిపై విధికి కన్నుకుట్టింది ఏమో కరెట్‌ షాక్‌తో ఆ ఇల్లాలి ప్రాణాలను బలిగొంది. తల్లి మరణించిన వార్త తెలియని ఆ చిన్నారి అమ్మ లే అమ్మ లే అమ్మ అని ఆమెను పట్టుకొని రోదించాడు. ఆ బాబు ఆక్రందనను చూసిన అక్కడివారు కన్నీంటి పర్యతమయ్యారు. ఈ విషాధ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

A woman Died an Current Shock in Mancherial District
A woman Died an Current Shock in Mancherial District

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 2:11 PM IST

A woman Died Due to Current Shock in Mancherial District : 'గౌతమ్‌ నన్ను మన్నించురా. అనుకోలేదు నా ప్రాణం అర్ధాంతరంగానే ముగుస్తుందని. చిన్నతనంలోనే అమ్మప్రేమకు దూరం అయ్యావు కదరా. పాలవాసనలు ఇంకా ఆరనేలేదు. ముక్కుపచ్చలారని పసివాడివిరా. కాసేపు కన్పించకుంటేనే తల్లడిల్లే వాడివి. నూరేళ్లు తల్లిప్రేమకు కరవైతివి. ఆకలేస్తే అమ్మ అమ్మా అంటూ పిలిచేవాడివి. ఇప్పుడు ఏట్లారా గౌతమ్‌. తలచుకుంటునే నరకం కనిపిస్తుంది. నీవు అమ్మ అమ్మ అని పిలుస్తుంటేనే గుండెలు పగులుతున్నాయి. అంబులెన్సు చుట్టూ తిరుగుతుంటే నా కన్నులు చెమ్మగిల్లాయి. అమ్మ కోసం నువ్వు అక్కడి వారిని అడుగుతుంటే బతికితే బాగుండు అనిపించింది నాన్న. ఏం చేద్దాం ఆ మృత్యువు కరెంట్ రూపంలో (Electric Shock Death Cases in Telangana)నన్ను కబళించింది. నీ లాలన ఎవరు చూస్తారో, నీకు లాలా ఎవరు పోస్తారో. కళ్లల్లో నీరూపం నింపుకొని లోకం వీడుతున్నా. నాలుగేళ్ల వయసులోనే నిన్ను ఒంటరిని చేసినందుకు నన్ను క్షమించురా బిడ్డా అని' తాను చనిపోతూ కూడా తన కుమారుడి కోసం పరితపించే ఓ తల్లి ఆవేదన ఇది. గుండెలు బరువెక్కెలా చేసే ఈ విషాధ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.

ఏడుగురి ప్రాణాలు తీసిన ఇనుప రాడ్.. ఊరేగింపునకు వెళ్తుంటే కరెంట్ తీగలు తగిలి..

Woman Dies Due to Electric Shock :మరికొద్ది గంటల్లో సంతోషంగా శ్రీరామనవమి పండగ వేడుకలు జరుపుకొనేందుకు సిద్ధమైన ఆ కుటుంబంలో విద్యుత్ ప్రమాదం విషాదాన్ని నింపింది. ఇందుకు సంబంధించి కాసిపేట ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం కాసిపేట మండలంలోని కోమటిచేను గ్రామానికి చెందిన బెడ్డల మౌనిక(26)ను బుధవారం ఇంట్లో వస్త్రాలను శుభ్రం చేస్తున్నారు. వాటర్‌ ట్యాంకు నుంచి నీరు రాకపోవడంతో నిచ్చెన సహాయంతో ఆమె రేకులపైకి వెళ్లారు. అయితే ఇంట్లోకి వచ్చే తీగ తెగి రేకులకు విద్యుత్ సరఫరా అయ్యింది. ఈ క్రమంలోనే మౌనిక విద్యుదాఘాతానికి గురై రేకులపై పడిపోయింది. ఎవరూ గమనించకపోవడంతో అక్కడికక్కడే మరణించింది.

మృతురాలు మౌనిక

పైకి వెళ్లిన తల్లి ఎంతకీ కిందకు రాకపోవడంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌ ఎక్కి నాలుగేళ్ల కుమారుడు గౌతమ్‌ చూడగా రేకులపైన మౌనిక పడిపోయి కనిపించింది. వెంటనే ఈ విషయాన్ని పెద్దనాన్నకు సమాచారం ఇవ్వడంతో రేకులపైకి వెళ్లిన ఆయనకు సైతం విద్యుత్ సరఫరా (Electric Shock Cases in Telangana )అయ్యింది. కింద ఉన్న వారు వెంటనే కరెంట్ సరఫరాను నిలిపివేయడంతో ఆయనకు ప్రాణాప్రాయం తప్పింది. అనంతరం మౌనికను కిందికి తీసుకురాగా అప్పటికే మృతి చెందిందని 108 సిబ్బంది తెలిపారని ఎస్సై ప్రవీణ్‌కుమార్ వివరించారు. దీనిపై కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

తల్లిని కాపాడాలని 108 సిబ్బందిని వేడుకుంటున్న కుమారుడు గౌతమ్

ఇంటికొచ్చిన కొద్ది గంటల్లోనే : మౌనిక తల్లి రెండు సంవత్సరాల కిందట మరణించింది. ఇంట్లో పనులు చేసేందుకు మూడు రోజుల కిందట ముత్యంపల్లిలోని తల్లిగారి నివాసానికి ఆమె వెళ్లింది. బుధవారం శ్రీరామ నవమి కావడంతో ఉదయాన్నే అత్తగారి ఇంట్లో మౌనికను తండ్రి దింపివేసి వెళ్లారు. కొద్దిగంటల్లోనే కుమార్తె మరణ వార్త రావడంతో తండ్రి రోదిస్తున్న తీరు గ్రామస్థులను కంటతడి పెట్టించింది. ఆమెకు భర్త రాజేశ్‌, కుమారుడు గౌతమ్‌ ఉన్నారు.

దుస్తులు ఆరేస్తుండగా భార్యకు కరెంట్​ షాక్​ - కాపాడబోయి దంపతుల మృతి

4 Years Girl Died By Touching Refrigerator in Super Market : సూపర్ మార్కెట్‌లో ఫ్రిజ్ ముట్టుకోగానే కరెంట్ షాక్​తో చిన్నారి మృతి

నీడ కోసం వేసిన రేకులషెడ్డు.. తల్లీకూతుళ్ల నిండు ప్రాణాలు తీసుకుంది..

ABOUT THE AUTHOR

...view details