తెలంగాణ

telangana

ETV Bharat / state

కట్టుకున్నోడిని చంపుతుంటే బయట కాపలా కాసింది - కట్టుకథ చెప్పి అడ్డంగా దొరికిపోయింది - WIFE KILLED HUSBAND WITH LOVER HELP - WIFE KILLED HUSBAND WITH LOVER HELP

Extra Marital Affair Murder in Bhadradri : వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా కట్టుకున్న భర్తనే ప్రియుడితో హత్య చేయించిందో భార్య. రెండు కుటుంబాల మధ్య ఉన్న పాత వివాదాన్ని మనసులో పెట్టుకుని నిందితుడి ఇల్లాలూ అతడికి సహకరించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Wife Who Killed Her Husband
Wife Who Killed Her Husband (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Jul 11, 2024, 12:45 PM IST

Updated : Jul 11, 2024, 2:31 PM IST

Wife Killed Husband In Bhadradri Kothagudem :వివాహేతర సంబంధాలు పచ్చని సంసారంలో చిచ్చురేపుతున్నాయి. ఫలితంగా భార్యాభర్తల మధ్య మనస్ఫర్థలకు దారి తీసి ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడనే కారణంగా కట్టుకున్న భర్తనే హత్య చేయించింది ఓ భార్య. మానవత్వాన్ని మంటగలిపే ఈ అమానవీయ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగింది. ఈ కేసుకు సంబంధించి పోలీసుల విచారణ చేస్తున్నప్పుడు విస్తుపోయే విషయాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి.

డీఎస్పీ షేక్​ అబ్దుల్​ రెహ్మన్​ తెలిపిన వివరాల ప్రకారం, కొత్తగూడెం పట్టణంలోని గౌతంపూర్ కాలనీకి చెందిన అరికె రమేశ్ ఆటో డ్రైవర్​గా పని చేస్తున్నారు. అయితే అదే ప్రాంతానికి చెందిన సాహు ఈశ్వర్ ​కుమార్ ​(38) భార్యతో అతడికి వివాహేతర సంబంధం ఉంది. కొద్ది రోజుల క్రితం ఈ విషయం ఈశ్వర్ ​కుమార్​కు తెలిసింది.

సింగరేణి క్వార్టర్​లో అక్రమంగా నివాసముంటున్న రమేశ్​ను అక్కడి నుంచి పంపించేయాలని నిర్ణయించుకున్నాడు ఈశ్వర్​ కుమార్​. ఆ ప్రాంతానికి చెందిన కొందరు స్థానికులతో కలిసి ఈ విషయంపై సింగరేణి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో స్పందించిన అధికారులు రమేశ్​ కుటుంబాన్ని అక్కడి నుంచి ఖాళీ చేయించారు.

బయట కాపలా కాసి భర్తను హత్య చేయించి :తన భార్య వివాహేతర సంబంధాన్ని సహించలేని ఈశ్వర్ ​కుమార్​ ఆమెతో తరచూ గొడవ పడుతుండేవాడు. దీంతో తన భర్త అడ్డువస్తున్నాడని ఈ విషయాన్ని ఆమె తన ప్రియుడు రమేశ్‌కు చెప్పడంతో పాటు, ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని రెచ్చగొట్టింది. అతడితో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నింది. వారి ప్లాన్​లో భాగంగా ఈ నెల 6న ఇంట్లో ఒంటరిగా ఉన్న ఈశ్వర్ ​కుమార్​పై రమేశ్​, అతడి అల్లుడు బట్టు చందు, భార్య ఇందిర కత్తులతో దాడి చేశారు.

పాత కక్షలతో :భర్త జాడ గురించి నిందితులకు ఉప్పందించిన అతడి భార్య, దాడి సమయంలో ఎవరూ రాకుండా ఇంటి బయట కాపలా కాసింది. గతంలో ఇల్లు ఖాళీ చేయించాడనే కక్షతోనే శత్రు కుటుంబం ఈ దారుణానికి పాల్పడినట్లు స్థానికులు, ఇతర కుటుంబ సభ్యులను నమ్మించింది. కత్తిపోట్లతో దారుణ హత్యకు గురైన బాధితుడు ఈశ్వర్​ కుమార్​ను ఓ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడే చికిత్స పొందుతూ ఈశ్వర్​ రావు మృతి చెందారు.

విచారణలో విస్తుపోయే విషయాలు :ఈ ఘటనపై టూ టౌన్​ సీఐ రమేశ్ ​కుమార్​ కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్న క్రమంలో హతుడి భార్యపై పోలీసులకు అనుమానం వచ్చింది. అమెను విచారించగా, అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నలుగురు నిందితులను బుధవారం రోజున పోలీసులు అరెస్టు చేసి రిమాండ్​కు తరలించినట్లుగా డీఎస్పీ వెల్లడించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నట్లు తెలిపారు.

సినిమాను తలపించేలా హత్య - భర్తను చంపించిన భార్య - Wife Killed Husband In Nalgonda

సినిమాను తలపించేలా హత్య - వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తను చంపించిన భార్య

Last Updated : Jul 11, 2024, 2:31 PM IST

ABOUT THE AUTHOR

...view details