Student Committed To Suicide in AP : పల్నాడు జిల్లాలోని నరసరావుపేటలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం తలెత్తిన క్రమంలో ఓ విద్యార్థిని ఏకంగా భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్లోని బొల్లాపల్లి మండలం వెల్లటూరుకు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతూ అక్కడే హాస్టల్‌లో ఉంటోంది. శనివారం (నవంబర్ 16)న ఉదయం హాస్టల్‌లో ఉన్న సమయంలో తన స్నేహితురాలితో పెన్ను విషయంలో స్వల్ప వివాదం జరిగింది.
పెన్ను కోసం గొడవ - భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య - STUDENT SUICIDE IN HOSTEL BUILDING
పెన్ను విషయంలో స్నేహితురాలితో స్వల్ప వివాదం - మనస్తాపంతో హస్టల్ భవనంపై నుంచి దూకి సూసైడ్
Published : Nov 16, 2024, 4:32 PM IST
ఆసుపత్రికి తరలింపు : దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనూష హాస్టల్ భవనంలోని నాలుగో ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందకు దూకింది. హాస్టల్ సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని అనూష మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కళాశాల యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న నరసరావుపేట ఆర్డీవో (రెవెన్యూ డివిజినల్ ఆఫీసర్) హేమలత, తహసీల్దార్ వేణుగోపాల్, నరసరావుపేట రూరల్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ మధ్యలో పిల్లలు చిన్న చిన్న విషయాలలో ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలియట్లేదు. స్వల్ప వివాదాలను కూడా పరిష్కరించుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇంకా కొంత మంది పిల్లలైతే తల్లిదండ్రులు తిట్టారని ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. చదువులో వెనుకబడుతున్నాం మా వల్ల కావట్లేదని తల్లిదండ్రులకు చెప్పలేక మరికొంత మంది విద్యార్థులు ప్రాణాలు వదిలి వారి తల్లిదండ్రులకు తీవ్ర శోకం మిగులుస్తున్నారు. ఈ రోజు అనూష అనే అమ్మాయి తన స్నేహితురాలితో ఓ పెన్ను గొడవ విషయంలో ప్రాణాలు తీసుకుంది.