తెలంగాణ

telangana

ETV Bharat / state

స్నేహితుల ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు - అలా తయారయ్యాడని దూరం పెట్టేసరికి! - INTER GIRL SUICIDE IN KURNOOL

ప్రేమించిన యువతి దూరం పెడుతుందని బ్లేడుతో దాడు - యువతికి తప్పిన ప్రాణాపాయం - పోలీసుల అదుపులో నిందితుడు

LOVE DISTANCES IN TWO PEOPLE
ATTACK ON A WOMAN (ETV Bharat)

By ETV Bharat Telangana Team

Published : Oct 19, 2024, 12:19 PM IST

Updated : Oct 19, 2024, 1:16 PM IST

Attack on Lover With Knife : తనను ప్రేమించి దూరం పెడుతుందనే కోపంతో ఓ యువతిపై ప్రేమోన్మాది బ్లేడ్‌తో దాడి చేసి గాయపరిచిన ఘటన హైదరాబాద్​ ఎస్సార్‌నగర్‌ పోలీస్​స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఏపీలోని శ్రీకాళహస్తి సమీపంలోని చోడవరానికి చెందిన మధుసూదన్‌రెడ్డి (22), అదే ప్రాంతానికి చెందిన యువతి (21) నెల్లూరు జిల్లాలోని ఓ ప్రముఖ కళాశాలలో ఇటీవలే ఇంజినీరింగ్‌ చదువు పూర్తి చేశారు. ఒకే కళాశాల అయినా వేర్వేరు విభాగాల్లో చదువుకున్న వీరు, స్నేహితుల ద్వారా పరిచయమై ప్రేమలో పడ్డారు.

తర్వాత ఐటీ కోర్సులో శిక్షణ తీసుకోవడానికి హైదరాబాద్‌ వచ్చారు. అమీర్‌పేటలోని సత్యం థియేటర్‌ సమీపంలోని ఓ కోచింగ్ సంస్థలో ఇద్దరూ శిక్షణ పొందుతున్నారు. ఇటీవల మద్యం, ఇతర వ్యసనాలకు బానిసైన మధుసూదన్‌ రెడ్డిని యువతి దూరం పెడుతుండడంతో అతడు ఆమెపై కోపం పెంచుకున్నాడు. మధుసూదన్‌ రెడ్డి గురువారం (అక్టోబర్ 17) సాయంత్రం ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌కు సమీపంలో ఉన్న ఆ యువతిపై బ్లేడ్‌తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆమె మెడకు తీవ్ర గాయమైంది. అప్పుడే అటుగా వెళ్తున్న పోలీస్ పెట్రోలింగ్‌ సిబ్బంది నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సార్‌నగర్‌ పోలీసులు తెలిపారు.

ప్రేమ పేరుతో వేధింపులు - యువతి మృతి : ఇంటర్ విద్యార్థినిని ప్రేమ పేరుతో వేధించడంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్నూలు జిల్లా ఆస్పరి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వసతి గృహంలో చదువుకుంటున్న బాలిక దసరా సెలవుల కారణంగా ఇంటికి వచ్చింది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లారు. ఇంట్లో ఒక్కతే ఉన్న సమయంలో అదే గ్రామానికి చెందిన బాలుడు వేధించసాగాడు.

దీంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆ బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తాము ఇంటికి వచ్చి చూసేసరికి బాలుడు పరారయ్యాడని చెప్పారు. తీవ్ర అస్వస్థతకు గురైన తమ కుమార్తెను ద్విచక్ర వాహనంపై ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో ఆ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

ఆ ఎమ్మెల్యేకు అర్ధరాత్రి నగ్న ​వీడియో కాల్‌ - వెంటనే ఏం చేశాడంటే?

డ్రైవింగ్ నేర్చుకుంటుండగా కారు అదుపుతప్పింది - బతుకమ్మ కుంటలోకి దూసుకెళ్లింది

Last Updated : Oct 19, 2024, 1:16 PM IST

ABOUT THE AUTHOR

...view details