Boy killed Over Extramarital Affair : నేటి కాలంలో వివాహేతర సంబంధాలు పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపుతున్నాయి. ఆ మోజులో పడి ఎంతోమంది తమ పండంటి కాపురాలను చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఓ వైపు ఆ మోజులో పడి కట్టుకున్న వాడిని కడుపున పుట్టిన వాళ్లను సైతం వదిలేసేందుకు సైతం సిద్ధపడుతున్నారు. మరోవైపు అడ్డొస్తే చంపడానికి సైతం వెనకాడటం లేదు. ఆ తర్వాత జరిగే పరిణామాలు తెలిసినా క్షణిక సుఖాల కోసం కుటుంబాలను రోడ్డున పడేస్తున్నారు. తద్వారా జీవితాలను అంధకారం చేసుకుంటున్నారు. వివాహేతర సంబంధాలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయనడానికి తాజాగా ఈ ఘటనే ఓ ఉదాహరణ.
తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. వివాహేతర సంబంధానికి బిడ్డ అడ్డుగా ఉన్నాడన్న నెపంతోనే బాలుడిని హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెలుగు చూసింది. స్థానిక పోలీస్ స్టేషన్‌లో గూడూరు డీఎస్పీ వీవీ రమణకుమార్ బుధవారం గ్రామీణ సీఐ కిషోర్‌బాబు, ఎస్సై సురేష్‌బాబుతో కలిసి వివరాలను వెల్లడించారు. చిల్లకూరు మండలం వరగలి గ్రామానికి చెందిన బాలుడు కాతారి లాసిక్(11) ఈ నెల 7 నుంచి కనిపించకుండా పోయాడు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
మరుసటి రోజు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం తిరుమలమ్మపాలెం వద్ద కండలేరు కాలువలో లాసిక్ శవమై తేలాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోట మండలం కొక్కుపాడు గ్రామానికి చెందిన కాతారి అనిల్‌కి బాలుడి తల్లితో వివాహేతర సంబంధం ఉంది. దాంతోపాటు ఆమెకున్న ఆస్తిపై అతడు కన్నేశాడు. దానిని సొంతం చేసుకునేందుకు తనతో వచ్చి ఉండమని కోరాడు. బిడ్డను వదిలి రాలేనని ఆమె చెప్పింది.