ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైలుపేట సంఘంతో ఎన్టీఆర్​కు ఆత్మీయ అనుబంధం- గుంటూరులో 55వసంతాల వేడుకకు సన్నాహాలు - NTR Cultural Association - NTR CULTURAL ASSOCIATION

55 Years Celebrations NTR Cultural Association in Guntur : తెలుగు నేలకి, తెలుగు జాతికి నిండైన వెలుగు నింపిన రూపం పేరు ఎన్టీఆర్​. ఈ మూడక్షరాలు చాలు తెలుగు వాడి హృదయం పొంగిపోవడానికి. ఆయన పేరిట రాష్ట్రంలో ఎన్నో అభిమాన సంఘాలు ఉండేవి. కానీ గుంటూరు జిల్లాలోని రైలుపేట సంఘం అంటే ఎన్టీఆర్​కు అమితమైన గౌరవం. ఈ సంఘం ఏర్పాటై 55 ఏళ్లు పూర్తి అయిన వేళ నేడు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్‌లో వేడుక నిర్వహించనున్నారు.

NTR Cultural Association
NTR Cultural Association (ETV Bharat)

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 25, 2024, 12:12 PM IST

55 Years Celebrations NTR Cultural Association in Guntur : సినీనటుల మీద అభిమానం సహజం. ఆ అభిమానం 5 దశాబ్దాలుగా కొనసాగుతూ, అదే అభిమానం సేవా కార్యక్రమాల వైపు మళ్లటం సామాన్యం విషయం కాదు. గుంటూరులో ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ కల్చరల్ అసోషియేషన్ అందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్‌కు అభిమాన సంఘాలు ఎన్నో ఉన్నా వాటిలో ఈ సాంస్కృతిక సంఘం ఎంతో ప్రత్యేకం. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎన్టీఆర్ నటనను, ఆయన వ్యక్తిత్వాన్ని అభిమానిస్తూ ప్రేమిస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ఏర్పాటై 55 ఏళ్లు పూర్తి అయిన వేళ నేడు గుంటూరు సిద్ధార్థ గార్డెన్స్‌లో వేడుక నిర్వహించనున్నారు.

పవిత్ర సంగమానికి పూర్వవైభవం - దసరా ఉత్సవాలకు ముందే సర్వం సిద్ధం - Krishna Godavari Pavithra Sangamam

ఎన్టీఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్ ఏర్పాటు :తెలుగువారి ఆరాధ్య నటుడు, నాయకుడు నందమూరి తారకరామారావుకు ( Sr NTR) అభిమానులంటే ఎంతో ప్రేమ. తెలుగు రాష్ట్రాల్లో ఆయన పేరిట ఎన్నో అభిమాన సంఘాలు ఉండేవి. కానీ గుంటూరు రైలుపేట సంఘం (Guntur Railpet Association) అంటే ఆయనకు అమితమైన గౌరవం. కుల, మతాలకు అతీతంగా 1969 మార్చి 9న రైలుపేటలో ఎన్టీఆర్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఏర్పాటైంది. ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతికి ఆయన తీసుకొచ్చిన గుర్తింపు, భావి తరాలకు ఎన్టీఆర్‌ గొప్పతనాన్ని చాటి చెప్పడమే లక్ష్యంగా పనిచేస్తున్న ఈ సంఘం 55 వసంతాలు పూర్తి చేసుకుంది.

ఎంతో అభిమానం చూపేవారు : ఎన్టీఆర్ కథానాయకుడిగా ఉన్నప్పుడే కాకుండా సీఎం అయిన తర్వాత కూడా రైలుపేట అసోషియేషన్ సభ్యులు కలవడానికి వెళితే ఎంతో అభిమానం చూపేవారు. ఆయన సాధారణంగా ఆదివారం కుటుంబ సభ్యులతో తప్ప ఇతరులకు కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ రైలుపేట అభిమాన సంఘానికి మాత్రం ఆదివారం కూడా ఎన్నోసార్లు ఆయన అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. సంఘ వ్యవస్థాపకులైన వై.సంగమేశ్వరరావు, బాబూరావు, వి. నాగేశ్వరరావు, ఎం.వి.సుబ్బారావు, వెంకటస్వామి, సి.హెచ్‌.సాంబశివరావు ఇప్పటికీ జీవించే ఉన్నారు.

మహనీయుని స్మరణలో - ఘనంగా ఎన్టీఆర్ 101 జయంతి వేడుకలు - NTR 101 Birth Anniversary

ఎన్టీఆర్​ గుర్తుగా : గుంటూరు ఏసీ కళాశాలలో ఎన్టీఆర్‌ విద్యాభ్యాసం చేశారు. దానికి గుర్తుగా ఎన్టీఆర్‌ పేరిట కళాశాల ఎదురుగా ప్రధాన రహదారి పక్కనే నాలుగు దశాబ్దాల క్రితం బస్‌షెల్టర్‌ నిర్మించారు. అప్పట్లో ఇక్కడ ఎకరా భూమి వెయ్యి ఉండేది. నిస్వార్థంగా చందా లేసుకుని అంత సొమ్ము వెచ్చించి నాలుగున్నర వేలు ఖర్చు చేసి దాన్ని నిర్మించామని సంఘ నాయకులు తెలిపారు.

5 దశాబ్దాలుగా కొనసాగిస్తున్న అభిమానం : 2001 నుంచి ఏటా ఎన్టీఆర్ కల్చరల్ అసోషియేషన్ సభ్యులు ఎన్టీఆర్‌ జయంతి, వర్ధంతికి అన్నదానం, వృద్ధాశ్రమాల్లోని వారికి దుస్తుల పంపిణీ చేస్తోంది. 2014లో తారకరామ స్మారక సేవా సమితి పేరుతో ట్రస్టు ఏర్పాటు చేశారు. 350 మంది సభ్యులు చందాలు వేసుకుని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్‌ సర్కిల్‌ వద్ద ఉన్న విగ్రహానికి ప్రతి గురువారం వీరు పుష్పాంజలి ఘటిస్తూనే ఉన్నారు. ఏపీలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఎన్టీఆర్‌ విగ్రహానికి ముసుగు వేసేయడంతో ఒక అభిమాని ఇంట్లో చిన్న విగ్రహాన్ని పెట్టి ఎన్నికల కోడ్‌ ముగిసే వరకు ప్రతి గురువారం అక్కడే దండేసి నివాళులర్పించారు. ఇదే స్ఫూర్తిని తమ తర్వాత తరం ఎన్టీఆర్ అభిమానులు కొనసాగించాలనేది వీరి ఆకాంక్ష. ఈ ఉత్సవాలకు శాసనసభాపతి అయ్యన్నపాత్రుడు, ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు, ప్రముఖ సినీనటి జయసుధ, దర్శకులు వైవీఎస్ చౌదరి హాజరు కానున్నారు.

తెలుగు ప్రజలకు తీపి కబురు.. 100 రూపాయల వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ

ABOUT THE AUTHOR

...view details