రాష్ట్రంలోని కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం - 37 మంది కాంగ్రెస్ నాయకులకు పదవులు - Nominated Posts in Telangana
37 Corporations Chairman in Telangana : తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకోచ్చేందుకు కృషి చేసిన నాయకులకు ప్రభుత్వం నామినేటెడ్ పదవులు ఇచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్లు దక్కని నేతలకు ఈ పదవులను కట్టబెట్టింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈనెల 14వ తేదీనే సర్కార్ ఉత్తర్వులు ఇచ్చింది.
37 Corporations Chairman in Telangana :రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు ఎదురుచూస్తున్న నామినేటెడ్ పదవులను తెలంగాణ సర్కార్ భర్తీ చేసింది. మొత్తం 37 కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమిస్తూ ఈ నెల 14వ తేదీనే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే హస్తం పార్టీలో చాలామంది ఆశావహులు దీనికోసం ఎదురుచూస్తున్నారు. ఈ పదవుల జాబితాలో పార్టీలో చురుగ్గా పనిచేసి సేవలందించిన వారిని గుర్తించి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ పదవులకు ఎంపిక చేశారు.
Corporation Chair Persons in Telangana 2024 :ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపునిస్తూ ఈ పదవులిచ్చారు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో వీరు మరింత ఉత్సాహంగా పనిచేయడానికి పదవుల భర్తీ ఉపకరిస్తుందని పార్టీ భావిస్తోంది. కొందరు నేతలు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు ఆశిస్తున్నారు.
టికెట్ ఇవ్వలేకపోయినవారికి కార్పొరేషన్ ఛైర్మన్ పదవులతో సర్దుబాటు చేశారు. ప్రధానంగా టీఎస్ ఆర్టీసీ, ఐఐసీ మినహా ముఖ్యమైన పదవులు వీరికి కేటాయించింది. మరోవైపు ఇప్పటికే టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులు, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఛైర్మన్, సభ్యుల నియామకం, వక్ఫ్ బోర్డు, రాష్ట్ర ప్రణాళిక బోర్డు ఛైర్మన్ పదవి, రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ పదవులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన విషయం తెలిసిందే.