కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దుల మృత్యువాత - పోలీసులకు చిక్కిన అక్రమ రవాణా ముఠా - Bulls Death in Suryapet - BULLS DEATH IN SURYAPET
Bulls Death in Suryapet : సూర్యాపేట జిల్లా మట్టపల్లి విషాదఘటన వెలుగులోకి వచ్చింది. కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న 16 ఎద్దులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాయి. తమిళనాడుకు చెందిన నలుగురు వ్యక్తులు కంటైనర్‌లో మూగజీవాలను తరలిస్తూ, మట్టపల్లి తనిఖీ కేంద్రం వద్ద పోలీసులకు చిక్కారు. ఈ క్రమంలోనే వాహనాన్ని తనిఖీ చేయగా, విషాదఘటన వెలుగులోకి వచ్చింది.
![కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దుల మృత్యువాత - పోలీసులకు చిక్కిన అక్రమ రవాణా ముఠా - Bulls Death in Suryapet Bulls Death in Suryapet](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/29-05-2024/1200-675-21586589-thumbnail-16x9-bulls-death.jpg)
Published : May 29, 2024, 3:46 PM IST
16 Bulls Died of Suffocation in Container :ఎద్దులను అక్రమంగా తరలిస్తున్న నలుగురు తమిళనాడుకు చెందిన వ్యక్తులను సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి చెక్‌పోస్టు వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూగాజీవాలను తరలిస్తున్న కంటైనర్‌లో ఊపిరాడక 16 ఎద్దులు మృతి చెందినట్లు గుర్తించారు. మరో తొమ్మిదింటిని గోశాలకు తరలించారు. కాగా ఒక ఎద్దుకు చికిత్స అందిస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సూర్యాపేట నుంచి ఏపీ వైపు వెళ్తుండగా మట్టపల్లి తనిఖీ కేంద్రం వద్ద కంటైనర్ పోలీసులకు పట్టుబడింది. మృతిచెందిన ఎద్దులకు పశువైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు.