104 Crore Rupees Scam Primary Agricultural Cooperative Credit Society (PACS) in Kirlampudi :కాకినాడ జిల్లా కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో 104 కోట్ల రూపాయల కుంభకోణం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. విచారణకే 18 నెలలు సాగదీస్తే నిందితులపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని అధికారులను నిలదీశారు.
కిర్లంపూడి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో జరిగిన 104 కోట్ల రూపాయల కుంభకోణంపై చర్చించడానికి మహాజన సభ నిర్వహించారు. సొసైటీ సీఈవో వెంకటరమణ నివేదిక వివరాలను చదివి వినిపించారు. ఎవరెవరు ఎంత మొత్తంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారో పేర్లతో సహా వెల్లడించారు.
సొసైటీలో రూ. 90 కోట్ల రుణాలు తీసుకున్నట్లు రికార్డుల్లో చూపించారని ప్రకటించారు. అందులో 13 వందల 11 మంది రైతులు తీసుకున్న రూ. 8 కోట్ల పంట రుణాలు, రూ. 22 కోట్ల దీర్ఘకాలిక రుణాలను అసలైన రైతులు తీసుకున్నారని మిగతావన్నీ తప్పుడు లెక్కలే అని తేల్చారు. ఈ కుంభకోణానికి పాల్పడ్డ అప్పటి అధికారులు సిబ్బందిపై సివిల్, క్రిమినల్ చర్యలు ఉంటాయని సహకార శాఖ సహాయ రిజిస్ట్రార్ రంగనాయకులు తెలిపారు.
భూ యజమాని బతికుండగానే డెత్ సర్టిఫికెట్ - 6 ఎకరాలు అక్రమ రిజిస్ట్రేషన్