Yuzvendra Chahal Divorce Rumours : టీమ్ఇండియా స్టార్ ప్లేయర్ యుజ్వేంద్ర చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై క్రికెటర్ తొలిసారి స్పందించాడు. తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశాడు. అతడి వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం పట్ల తన కుటుంబం మానసిక వేదనకు గురవుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
'నా అభిమానులు లేకుండా నేను ఇంత సాధించేవాడిని కాదు. వారి పట్ల ఎల్లప్పడూ గర్వంగానే ఉంటా. కానీ నా జర్నీ ఇంతటితో ముగియలేదు. నా దేశం, నా జట్టు కోసం ఇంకా మరెంతో సాధించాల్సి ఉంది. ఓ క్రీడాకారుడిగా, ఓ కుమారుడిగా, ఓ సోదరుడిగా, ఓ మిత్రుడిగా ఎంతో గర్వంగా ఉన్నాను. నా వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ప్రచారం పట్ల అందరికీ కాస్త ఆత్రుతగా ఉంటుందని అర్థం చేసుకోగలను. అయితే సోషల్ మీడియాలో వస్తున్న ఆ వార్తలు నిజం కావచ్చు, కాకపోవచ్చు!'
'అందుకే ఇలాంటి వార్తలు ప్రచారం చేయవద్దని ఓ సోదరుడిగా, ఓ మిత్రుడిగా మీ అందర్నీ కోరుతున్నా. ఆ వార్తలు నన్ను నా కుటుంబాన్ని మానసికంగా కలచి వేస్తున్నాయి. ఎల్లప్పడూ అందరి మంచి కోరుకోవాలని, షార్ట్కట్లు కాకుండా హార్డ్‌వర్క్ చేసి విజయం సాధించాలని నా కుటుంబం నాకు నేర్పింది. నేను ఆ విలువలకు కట్టుబడి ఉన్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో మీ ప్రేమ, మద్దతు పొందేందుకు ఇంకా కష్టపడుతాను.లవ్ యూ' అని పోస్ట్‌లో రాసుకొచ్చాడు.
చాహల్ ఇన్‌స్టా స్టోరీ (Source : Chahal Insta Screenshot) ధనశ్రీ రియాక్షన్
ఈ ప్రచారంపై ముందుగా ధనశ్రీయే స్పందించింది. ఈ మేరకు ఆమె కూడా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. 'కొన్ని రోజులుగా నేను, నా ఫ్యామిలీ ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. అసలు నిజం ఎంటో తెలుసుకోకుండా అవాస్తవాలను రాస్తున్నారు. నాపై ద్వేషం కలిగేలా ట్రోల్స్ చేస్తున్నారు. ఇది నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఈ స్థాయికి రావటానికి ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నాను. నేను మౌనంగా ఉంటున్నానంటే దానికి బలహీనంగా ఉన్నట్లు కాదు. వాస్తవ పరిస్థితులను దృష్టిలోపెట్టుకొని విలువలతో ముందుకుసాగాలని అనుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా సరే విజయం సాధిస్తుంది. దాన్ని సమర్థించుకోవాల్సిన అవసరం నాకు అస్సలు లేదు' అని పోస్ట్ షేర్ చేసింది.
జరిగింది ఇదీ?
చాహల్- ధనశ్రీ విడిపోతున్నారంటూ కొన్ని రోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకోవడం, చాహల్ తన ఖాతా నుంచి సతీమణి ఫొటోలను తొలగించడం వల్ల ఈ రూమర్స్ మరింత బలపడ్డాయి. చాహల్- ధనశ్రీ 2020లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ జంట గతంలో పెట్టిన పోస్టులు అభిమానులను గందరగోళానికి దారి తీశాయి. వీరిద్దరూ విడాకులు తీసుకుంటున్నారంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఆ తర్వాత స్పందించిన చాహల్ తాము విడిపోవట్లేదని ఇటీవల తెలిపాడు.
చాహల్- ధనశ్రీ డివోర్స్? ఇన్‌స్టాలో అసలేం జరుగుతోంది?
చాహల్ డివోర్స్ రూమర్స్! - వైరలవుతోన్న ధనశ్రీ ఇన్‌స్టా పోస్ట్