Chahal Dhanashree Divorce :టీమ్ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్- ధనశ్రీ వర్మ విడిపోతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ క్రమంలో వీరిద్దరూ తమతమ సోషల్ మీడియా అకౌంట్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. అంతేకాకుండా చాహల్ తన అకౌంట్ నుంచి సతీమణి ధనశ్రీ ఫొటోలను డిలీట్ చేశాడు. దీంతో ఈ ప్రచారానికి మరింత బలం చేకూరింది.
అయితే చాహల్‌ను ధనశ్రీ ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేసినప్పటికీ, అతడితో ఉన్న ఫొటోలను మాత్రం ఆమె డిలీట్ చేయలేదు. 'వారిద్దరూ కచ్చితంగా విడాకులు తీసుకోనున్నారు. ఈ విషయం అఫీషియల్‌గా డిక్లేర్డ్ చేసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. కానీ, వాళ్లు ఎందుకు విడిపోవాలనుకుంటున్నారో కారణాలు మాత్రం తెలీదు' అని సంబంధింత వర్గాలు వెల్లడించాయి.