తెలంగాణ

telangana

ETV Bharat / sports

నటితో యూవీ డేటింగ్! - ' వద్దన్నా వెనకాలే వచ్చేసింది, తనను ఆపేందుకు అలా చేయాల్సి వచ్చింది' - Yuvraj Singh Dating Actress - YUVRAJ SINGH DATING ACTRESS

Yuvraj Singh Dating Actress : భారత మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ గతంలో ఓ హీరోయిన్​తో డేటింగ్ చేసినట్లు తాజాగా ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు. అయితే ఆ సమయంలో తాను చేసిన ఓ ఫన్నీ మూమెంట్​ను కూడా గుర్తు చేసుకున్నాడు. ఆ వివరాలు మీ కోసం.

Yuvraj Singh
Yuvraj Singh (Getty Images)

By ETV Bharat Sports Team

Published : Sep 26, 2024, 12:59 PM IST

Yuvraj Singh Dating Actress : టీమ్ఇండియా మాజీ స్టార్ క్రికెటర్ యువరాజ్‌ సింగ్ తాజగా ఓ ఇంటర్వ్యూలో తన గురించి ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. గతంలో ఆయన ఓ సినీ నటితో డేటింగ్‌ చేసినట్లు తెలిపాడు. 2007-08 సమయంలో తను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో ఎదురైన ఈ అనుభవాన్ని ఆయన తాజాగా గుర్తు చేసుకున్నాడు.

"గతంలో నేను ఓ హీరోయిన్​తో డేటింగ్‌ చేశాను. అప్పుడు ఆమె కూడా చాలా టాప్​ పొజిషన్​లో ఉంది. నేను ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సమయంలో తన అడిలైడ్‌లో షూటింగ్‌ కోసం వచ్చింది. మేము అప్పుడు కాన్‌బెర్రాలో ఉన్నాం. అప్పుడే ఆమెకు నేను ఒక మాట చెప్పాను. ప్లీజ్​ నువ్వు ఇక్కడికి రావద్దు. నేను గేమ్‌పై ఫోకస్ పెట్టాలనుకుంటున్నాను. ఇది ఆసీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌' అని అన్నాను. కానీ ఆమె మాత్రం మా వెనకనే కాన్‌బెర్రాకు వచ్చేసింది. అప్పటికే నేను తొలి రెండు టెస్టుల్లో పెద్దగా పరుగులేం చేయలేదు. ఆమెను చూశాక 'నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?' అని అడిగాను. 'నీతో టైమ్ స్పెండ్ చేద్దామ వచ్చాను' అని చెప్పింది. ఆమెతో ఆ రోజు మొత్తం ఉండిపోయాను. 'ఇక నువ్వు నీ కెరీర్‌ మీద కాన్సన్​ట్రేషన్ చేయ్​. నేను నా పని మీద ఉంటాను' అని అనాన్ను. ఆసీస్‌ పర్యటన ఎంత కష్టమో అని తెలిసిందే కదా. ఆ తర్వాత కాన్‌బెర్రా నుంచి అడిలైడ్‌కు వెళ్లేందుకు రెడీ అవుతున్నాను. అయితే ఆమె నా సూట్‌కేస్‌ను ప్యాక్‌ చేసింది. అయితే ప్రయాణం చేయాల్సిన రోజు ఉదయం నా షూ ఎక్కడ అని అడిగాను. అప్పుడు ఆమె వాటిని కూడా ప్యాక్‌ చేశానని చెప్పింది. మరి నేను బస్సులో ఎలా వెళ్లాలి అని అడిగాను. అప్పుడు ఆమె తన షూ వేసుకోమని చెప్పింది. అప్పుడు తనకు పింక్‌ స్లిప్పర్లు ఉన్నాయనుకుంటా. ఓరి దేవుడా నాకెంత కష్టం వచ్చిపడింది అని అనుకున్నా. వాటిని వేసుకొని నిదానంగా బస్సు దగ్గరకు వచ్చేశాను. నా లగేజీ బ్యాగ్‌ను అడ్డుపెట్టుకుని మరీ కనిపించకుండా చేశాను. అయితే, నా టీమ్ మెంబర్స్ కొందరు నన్ను చూసేశారు. చప్పట్లు కొట్టి మరీ ఆట పట్టించారు. దీంతో వేరేవి తీసుకొనేంతవరకూ ఆ పింక్‌ స్లిప్పర్లతోనే జర్నీ చేయాల్సి వచ్చింది" అని యువరాజ్‌ గుర్తు చేసుకున్నాడు. అయితే ఆ హీరోయిన్ ఎవరనే విషయాన్ని యువీ ఆ ఇంటర్వ్యూలో రివీల్ చేయలేదు.

ABOUT THE AUTHOR

...view details