Hyderabad : ఐపీఎల్ 2024లో దాదాపు సగం మ్యాచ్‌లు పూర్తయ్యాక, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరుతుందని ఎవ్వరూ ఊహించలేదు. ఎప్పటిలానే ఆర్సీబీ టీమ్‌కి, ఫ్యాన్స్‌కి నిరాశ తప్పదనే విమర్శలు వచ్చాయి. కానీ అంచనాలను తలకిందులు చేస్తూ, వరుసగా ఆరు విజయాలతో బెంగళూరు ప్లేఆఫ్స్‌కి చేరింది. తాజాగా బెంగళూరులో చెన్నైతో జరిగిన కీలక పోరులో ఆర్సీబీ 27 పరుగులతో విజయం సాధించింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. అయితే ధోనీ, జడేజా వంటి స్టార్ ప్లేయర్‌లు క్రీజులో ఉండగా అద్భుతమైన బౌలింగ్‌తో ఆర్సీబీని గెలిపించిన యశ్ దయాల్ ఆర్సీబీ హీరోగా మారాడు. తాజాగా ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో దయాల్, తన సక్సెస్, క్రికెట్ జర్నీ, టీమ్ సపోర్ట్ గురించి ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు.
చెన్నై ప్లేఆఫ్స్‌కి చేరాలంటే చివరి ఓవర్‌లో 17 పరుగులు చేయాల్సి వచ్చింది. క్రీజులో సీనియర్ ప్లేయర్‌లు ధోనీ, జడేజా ఉన్నారు. ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్, యశ్ దయాల్‌కు బాల్ అందించాడు. దయాల్ వేసిన మొదటి బంతికే ధోనీ భారీ సిక్సర్ బాదాడు. అందరిలోనూ ఒత్తిడి మరింత పెరిగింది. కానీ యష్ దయాల్ తన ప్లాన్‌ని అమలు చేయడంపైనే ఫోకస్ చేశాడు. రెండో బంతికే ధోని భారీ షాట్‌కి ప్రయత్నించి, ఫీల్డర్ చేతికి చిక్కాడు. తర్వాత నాలుగు బాల్స్‌కి కేవలం ఒక్క రన్ మాత్రమే ఇచ్చిన యశ్ దయాల్, ఆర్సీబీని ప్లేఆఫ్స్‌కి చేర్చాడు.
ఈ 26 ఏళ్ల పేసర్ తన విజయాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చాడు. 'ఇదంతా నా హార్డ్ వర్క్, విజువలైజేషన్, మజిల్ మెమరీ నుంచి వచ్చింది. ఇదంతా నిజంగా నా తల్లిదండ్రుల కృషి వల్లనే. నా స్కూల్ ఎడ్యుకేషన్‌పై జాగ్రత్త తీసుకున్నారు, స్పోర్ట్స్‌పై నాకున్న ఇంట్రెస్ట్‌ని సపోర్ట్ చేశారు.' అని చెప్పాడు. తల్లిదండ్రుల త్యాగాల వల్లనే ఇలా తాను ఓ సక్సెస్‌ఫుల్ క్రికెటర్‌గా ఎదిగానని తెలిపాడు.