WTC Points Table 2025 :ఆస్ట్రేలియాతో జరిగిన పింక్ బాల్ టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడింది. దీంతో భారత్ వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిఫ్ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ ఓటమితో భారత్ డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత్ 57.29 శాతంతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ అగ్ర స్థానంలో ఉండేది.
WTC 2025: అగ్ర స్థానం గల్లంతు- మూడో ప్లేస్‌కు పడిపోయిన భారత్ - WTC POINTS TABLE 2025
డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ అప్డేట్- టాప్‌లోకి దూసుకెళ్లిన ఆసీస్
WTC Points Table 2025 (Source : Associated Press)
Published : Dec 8, 2024, 11:56 AM IST
|Updated : Dec 8, 2024, 12:44 PM IST
తాజా విజయంతో ఆసీస్ అగ్ర స్థానంలోకి దూసుకెళ్లింది. టేబుల్లో ఆసీస్ (60.71 శాతం) టాప్‌లో ఉండగా, సౌతాఫ్రికా (59.26 శాతం) రెండో ప్లేస్‌లో ఉంది. ఇక శ్రీలంక (50 శాతం), ఇంగ్లాండ్ (45.24 శాతం), న్యూజిలాండ్ (44.23 శాతం)తో వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 2025 మార్చి నాటికి పట్టికలో టాప్ రెండు స్థానాల్లో ఉన్న జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
Last Updated : Dec 8, 2024, 12:44 PM IST