WPL 2024 UP Warriorz vs Royal Challengers :మహిళల ప్రీమియర్ లీగ్‌లో భాగంగా నేడు(మార్చి 4) జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. అయితే ఈ సీజన్-2లో వరుసగా రెండు ఓటముల అందుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ మ్యాచ్‌లో దంచికొట్టి విజయం సాధించింది. బ్యాటింగ్‌లో అదరగొట్టి బౌలింగ్‌లో సమష్టిగా సత్తా చాటింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 175 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా ఆర్సీబీ 23 పరుగులు తేడాతో విజయం సాధించింది.
అలీస్సా హెలీ(38 బంతుల్లో 7 ఫోర్లు, మూడు సిక్స్‌ల సాయంతో 55 పరుగులు) టాప్ స్కోరర్‌గా నిలిచింది. ఆ తర్వాత దీప్తి శర్మ(22 బంతుల్లో 4 ఫోర్ల సాయంతో 33 పరుగులు) పర్వాలేదనిపించింది. ఇక కిరణ్, చమారి అటపట్టు, గ్రేస్ హ్యారిస్, శ్వేత షెహ్రావత్ విఫలమయ్యారు. చివర్లో వచ్చిన పూనమ్ ఖెమ్నార్ మాత్రం(31) దూకుడుగా ఆడి లక్ష్యం అంతర్యాన్ని కాస్త తగ్గించింది. ఆర్సీబీ బౌలర్లలో ఆశా శోభన, గార్జియా వారెహమ్, సోఫీ డివైన్ సోఫీ మోలినెక్స్ తలో రెండు వికెట్లు తీశారు.