WPL 2024 UP Warriors VS RCB :మహిళల ప్రీమియర్ లీగ్-2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మరో అద్భుత విజయం సాధించిన సంగతి తెలిసిందే. బెంగళూరు వేదికగా జరిగిన మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌పై 23 పరుగుల తేడాతో ఆర్సీబీ గెలిచింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ బ్యాటర్లు దంచికొట్టేలా బ్యాటింగ్ చేశారు. ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడారు.
అయితే ఆర్సీబీ ఇన్నింగ్స్ ఆడేటప్పుడు ఓ అనుహ్య సంఘటన జరిగింది. ఆర్సీబీ స్టార్ ఎల్లీస్ పెర్రీ బాదిన ఓ భారీ సిక్సర్ దెబ్బకు ఏకంగా కారు అద్దం పూర్తిగా పగిలిపోయింది. ముక్కలు అయిపోయింది. ఆర్సీబీ ఇన్నింగ్స్ 19వ ఓవర్ లాస్ట్ బాల్‌ను పెర్రీ లాంగ్ ఆన్ మీదుగా సిక్సర్‌గా మలిచింది. అయితే ఆ బంతి డైరెక్ట్‌గా వెళ్లి డిస్‌ప్లే బాక్స్‌లో ఉన్న కారు అద్దానికి బలంగా తాకింది. దీంతో ఆ కారు అద్దం పూర్తిగా పగిలిపోయింది.
ఇది చూసిన క్రికెట్ అభిమానులు, ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. పెర్రీ కూడా తలపై చేతులు వేసుకుని అయ్యో అన్నట్లుగా రియాక్షన్ ఇచ్చింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఏంత పని చేశావ్ పెర్తీ, నీకు జీతం కట్ అంటూ సరదా కామెంట్లు చేస్తున్నారు. కాగా, డబ్ల్యూపీఎల్ ప్రస్తుత సీజన్ పూర్తైన తర్వాత ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డుగా ఈ కారును అందజేసేందుకు డిస్ ప్లే బాక్స్‌లో పెట్టారు. కానీ ఇప్పుడు దాని అద్దమే పగిలిపోయింది.