WPL 2024 Play offs : మహిళల ప్రీమియర్ లీగ్ 2024 ఉత్కంఠగా సాగుతోంది. ఇప్పటికే అన్ని జట్లు సగం మ్యాచ్‌ల వరకు ఆడేశాయి. దీంతో ఆయా జట్ల ఆటతీరుపై ఓ అంచనా వచ్చేసినట్టైంది. మరి ఈ అంచనా ఆట తీరు ఆధారంగా ప్లేఆఫ్స్ రేసులో ఎవరు ఉంటారు? ఎవరు ఇంటి ముఖం పడతారో ప్రస్తుతం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. దిల్లీ క్యాపిటల్స్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానంలో ఉంది. గుజరాత్ జెయింట్స్ ఇంకా ఖాతా తెరవక ప్లే ఆఫ్స్ అవకాశాలను కష్టతరం చేసుకుంది.
Delhi Capitals Women : ఈ జట్టు అన్ని విభాగాల్లో బాగానే రాణిస్తోంది. మెగ్ లానింగ్ కెప్టెన్. ఆడిన నాలుగింట్లో మూడు విజయాలు సాధించింది. 6 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మెరుగైన రన్‌రేట్ కూడా ఉంది. ప్లేఆఫ్స్ చేరే అవకాశాలు ఈ జట్టుకు ఎక్కువగా ఉన్నాయి.
Mumbai Indians Women : డిఫెండింగ్ చాంఫియన్‌గా బరిలోకి దిగిన ముంబయి ఇండియన్స్ కూడా మంచి ప్రదర్శనే చేస్తోంది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించింది. రన్‌రేట్ కాస్త తక్కువ అవ్వడం వల్ల రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇదే ఊపు కొనసాగిస్తే ఈ జట్టు కూడా ప్లే ఆఫ్స్ చేరే అవకాశం కనిపిస్తోంది.
UP Warriorz : ఆడిన నాలుగు మ్యాచుల్లో రెండు విజయాలే సాధించింది. ప్లేఆఫ్స్ అర్హత సాధించాలంటే మిగతా మ్యాచ్‌ల్లో గెలవడం కాకుండా ఇతర టీమ్స్ రిజల్ట్స్ తనకు కలిసిరావాలి. అయితే ఈ జట్టుకు రన్‌రేట్ కాస్త ఎక్కువ ఉండటం కలిసొచ్చే అంశం.