తెలంగాణ

telangana

By ETV Bharat Telugu Team

Published : Mar 12, 2024, 10:36 PM IST

Updated : Mar 12, 2024, 11:06 PM IST

ETV Bharat / sports

WPL 2024 ముంబయిపై విజయం - పెర్రీ సంచలన ప్రదర్శనతో ప్లేఆఫ్స్​కు ఆర్సీబీ

WPL 2024 Mumbai Indians VS RCB : డబ్ల్యూపీఎల్ 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్​లో ఆర్సీబీ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 15 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లింది.

Mumbai Indians Women vs RCB
Mumbai Indians Women vs RCB

WPL 2024 Mumbai Indians VS RCB :మహిళల ప్రీమియర్‌ లీగ్‌(డబ్ల్యూపీఎల్) 2024లో భాగంగా నేడు జరిగిన మ్యాచ్​లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు​ విజయం సాధించింది. ఏడు వికెట్ల తేడాతో గెలిచి ముంబయిని చిత్తు చేసింది. 114 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగి 15 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. 115 పరుగులు చేసింది. ఈ విజయంతో ఆర్సీబీ(RCB Playoffs) ప్లేఆఫ్స్​కు దూసుకెళ్లింది. ఎల్లిస్​ పెర్రీకి ప్లేయర్ ఆఫ్​ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

మ్యాచ్​లో భాగంగా మొదట బ్యాటింగ్‌ చేసిన ముంబయి 113 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సజనా(30) టాప్​ స్కోరర్​గా నిలిచింది. ఆ తర్వాత హేలీ మాథ్యూస్‌(26) పర్వాలేదనిపించింది. ఇక మిగతా వారంతా ఫెయిల్ అయ్యారు. ఎలిస్‌ పెర్రీ 6 వికెట్లు తీసి ముంబయి పతనాన్ని శాసించింది. ఆ జట్టు ఇన్నింగ్స్‌ను పేకమేడలా కూల్చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన ఆర్సీబీ 15 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఎలిస్‌ పెర్రీ (38 బంతుల్లో 5 ఫోర్లు ఒక సిక్స్​ సాయంతో 40*), రిచా ఘోష్‌ (28 బంతుల్లో 4 ఫోర్లు 2 సిక్స్​ల సాయంతో 36*) మంచిగా రాణించారు.

తొలి క్రికెటర్‌గా రి​కార్డు(Ellyse Perry Bowling):ఆర్సీబీ ఆల్‌రౌండర్‌, ఆసీస్‌ స్టార్‌ అయిన ఎలీస్‌ పెర్రీ ఈ మ్యాచ్​లో తన బౌలింగ్​తో నిప్పులు చేరిగింది. ఏకంగా 6 వికెట్లతో ప్రత్యర్థి జట్టు బ్యాటర్లను బెంబేలెత్తించింది. తన 4 ఓవర్ల కోటాలో కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లను తీసింది. ఇవన్నీ కూడా బౌల్డ్‌లు, ఎల్బీ రూపంలో వచ్చినివే. అలా ఈ సంచలన ప్రదర్శనతో పెర్రీ ఓ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకుంది. మహిళల ప్రీమియర్‌ లీగ్‌ చరిత్రలోనే ది బెస్ట్​ బౌలింగ్‌ గణంకాలను నమోదు చేసిన బౌలర్‌గా రికార్డుకు ఎక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు దిల్లీ క్యాపిటల్స్​కు చెందిన స్టార్‌ ఆల్‌రౌండర్‌ మరిజన్నె కాప్‌(5/15) పేరిట ఉండేది. ఇప్పుడీ మ్యాచ్‌తో మరిజన్నె కాప్‌ రికార్డును పెర్రీ అధిగమించింది.

IPL 2024 ఈ సారైనా పంజాబ్ తలరాతమారేనా?

ధోనీ తర్వాత కెప్టెన్​ అతడే - క్లారిటీ ఇచ్చిన సీఎస్కే సీఈఓ

Last Updated : Mar 12, 2024, 11:06 PM IST

ABOUT THE AUTHOR

...view details