IND VS NZ Ameliya kerr Run Out Controversy : టీ20 వరల్డ్ కప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన ఇండియా ఉమెన్స్ టీమ్ తమ తొలి మ్యాచ్‌లోనే తేలిపోయింది. ప్లేయర్సంతా అంచనాలు అందుకోవడంలో విఫలం కావడం వల్ల ఈ పోరులో భారత జట్టు 58 పరుగులు తేడాతో ఓడిపోయిది. న్యూజిలాండ్ చేతిలో కంగుతిన్నది. అయితే ఈ మ్యాచులో న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో అమెలియా కెర్ రనౌట్ అయినా అంపైర్లు ఇవ్వకపోవడం, రనౌట్ రివ్యూ ఫలితం భారత్‌కు అనుకూలంగా రాకపోవడం వివాదాస్పదంగా మారింది.
JEMIMAH ON RUNOUT CONTROVERSY :మ్యాచ్ అనంతరం ఈ వివాదస్పద అంశంపై టీమ్‌ఇండియా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడింది. అంపైర్ నిర్ణయాలను తాము గౌరవిస్తామని చెప్పింది. కానీ ఇలా జరగడం అత్యంత దారుణమని పేర్కొంది.
"దీప్తికి అంపైర్ క్యాప్ ఇవ్వడాన్ని నేను చూడలేదు. అప్పుడు నేను దగ్గరగా లేను. కివీస్ బ్యాటర్లు కూడా రెండో రన్ కోసం పరుగెత్తారు. అమేలియా కెర్ కూడా ఓవర్ పూర్తి కాలేదని ఉద్దేశంతోనే కనిపించింది. మేం కూడా అదే ఆలోచనతో ఉన్నాం. రన్ ఔట్ అయినట్లు భావించాం. కానీ, అంపైర్ మాత్రం మరోలా నిర్ణయం తీసుకున్నారు. ఏది ఏమైనా అది మా చేతుల్లో లేని విషయం. వారి నిర్ణయాన్ని గౌరవిస్తాం. కానీ, అమేలియా కెర్ తనకు తానే డగౌట్‌కు వెళ్తుంటే, ఆమెను ఆపి మరీ బ్యాటింగ్ చేయమని చెప్పడం ఇబ్బందిగా అనిపించింది. ఔట్ అయినట్లు ఆమెకు కూడా తెలుసు. అందుకే ఆమె బయటకు వెళ్లేందుకు సిద్ధమైంది" అని జెమీమా చెప్పుకొచ్చింది.