Wimbledon Mens Singles 2024 :యంగ్ ప్లేయర్కార్లోస్ అల్కరాస్ వింబుల్డన్ టైటిల్‌ను గెలుచుకున్నాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్‌ను ఓడించాడు. 24 గ్రాండ్ స్లామ్‌లు గెలిచిన జకోవిచ్‌పై 6-2, 6-2, 7-6 (7-4)తో గెలుపొందాడు.
తొలి రెండు సెట్‌లను ఈజీగా గెలిచినప్పటికీ, మూడో సెట్‌లో ఇద్దరి మధ్య గట్టి పోటీ నెలకొంది. 6-6తో మూడో సెట్ సమం కావడం వల్ల మ్యాచ్ ట్రై బ్రేకర్‌కు చేరుకుంది. అందులో కార్లోస్ 7-4తో జకోవిచ్‌ను ఓడించాడు. ఇక ఈ టోర్నీలో ఛాంపియన్‌గా నిలిచిన ప్లేయర్‌కు దాదాపు రూ.22 కోట్లు, రన్నరకు రూ. 12కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.
టోర్నీ ఎలా జరిగిదంటే?
టోర్ని మొదటి నుంచే అల్కరాస్ చాలా కాన్ఫిడెంట్‌గా ఆడాడు. తన మూవ్స్‌తో ప్రత్యర్థలను కట్టుబెట్టాడు. సెమీఫైనల్స్‌లో ఎనర్జిటిక్‌గా ఆడి రష్య ఆటగాడు డానిల్ మెద్వెదేవ్‌ను ఓడించిన ఈ యంగ్ స్టార్, ఆదివారం స్పెయిన్ కోర్టు వేదికగా జరిగిన పోరులో చెలరేగిపోయాడు. మొదటి సెట్ నుంచి నుంచి జోరుగా ఆడి గెలుపొందాడు. ఇక అదే ఊపుమీద రెండో సెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు.