Wimbledon 2024 Novak Djokovic Fire on Audience : వింబుల్డెన్ 2024 ఎడిషన్‌లో స్టార్ ప్లేయర్ నొవాక్ జకోవిచ్ ప్రేక్షకుల తీరుపై మరోసారి అసహనం వ్యక్తం చేశాడు. అలానే ఓ రిపోర్టర్‌పై కాస్త అగ్రహం వ్యక్తం చేశాడు. ఇంటర్వ్యూ మధ్యలో నుంచే లేచి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్‌గా మారింది.
అసలేం జరిగిందంటే? - జులై 9న డెన్మార్క్‌కు చెందిన ప్రత్యర్థి రూనెతో మ్యాచ్‌లో తలపడ్డాడు జకోవిచ్. అయితే ఓ పాయింట్ విషయంలో జకోవిచ్ అప్పీలు చేశాడు. అప్పుడు రూనెకు మద్దతుగా నినాదాలు చేశారు కొందరు ప్రేక్షకులు. అదే సమయంలో విపరీతంగానూ ప్రవర్తించారు. దీంతో మైదానంలోనే జకోవిచ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. మీరు కనీసం నన్ను టచ్ కూడా చేయలేరు అంటూ వ్యాఖ్యానించాడు.
ఇక జులైన 10న జరిగిన క్వార్టర్ ఫైనల్లో నాలుగో రౌండ్ మ్యాచ్ ముగిశాక జకోవిచ్ ఓ రిపోర్టర్‌తో మాట్లాడు. ఆ సమయంలోనూ జకోవిచ్ మాట్లాడుతుంటే ప్రేక్షకులు గట్టిగా అరుపులతో హోరెత్తించారు. దీంతో జకోవిచ్ మరోసారి తీవ్రంగా అసహనం వ్యక్తం చేశాడు. కొందరు తమ పరిధిని దాటి ప్రవర్తించారని, అలా చేయడం సరైనది కాదని అన్నాడు.