Pat Cummins Sun Risers Hyderabad : గాయం నుంచి త్వరగా కోలుకొని 2025 ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కల్లా అందుబాటులోకి రావాలని ఉందంటూ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ ఆశాభావం వ్యక్తం చేశాడు. చీలమండ గాయం కారణంగా 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన కమిన్స్ ప్రస్తుతం నెమ్మదిగా కోలుకుంటున్నాడు. దీంతో తన టైమ్‌ను ఇప్పుడు ఈ సమయాన్ని రికవరీ కోసం అలాగే ఫ్యామిలీతో గడిపేందుకు ఉపయోగించుకున్నట్లు పేర్కొన్నాడు. ఈ బ్రేక్‌ని రాబోతున్న కీలక టోర్నీలు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, ఐపీఎల్‌కి ముందు పూర్తిగా కోలుకునేందుకు లభించిన అవకాశంగా భావిస్తున్నాడు.
ఆస్ట్రేలియాకు ఎదురుదెబ్బ
ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. కమిన్స్ సహా ఫాస్ట్ బౌలర్ హేజిల్‌వుడ్, ఆల్-రౌండర్లు మార్కస్ స్టాయినస్, మిచెల్ మార్ష్ వంటి కీలక ఆటగాళ్లను కోల్పోయింది. కమిన్స్ స్థానంలో వైస్ కెప్టెన్ స్టీవెన్ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
ఇటీవల పాట్ కమిన్స్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, ‘ఇది నాకు ఓ అద్భుతమైన నెల. ట్రైనింగ్ లేదా రాబోయే పర్యటన గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆలోచనలు లేకుండా పూర్తిగా ఫ్యామిలీతో సమయం గడపడం నిజంగా ప్రత్యేకమైంది. వచ్చే వారం నుంచి బౌలింగ్ చేయడం ప్రారంభించాలి. క్రమంగా కోలుకుని ఐపీఎల్‌కి సిద్ధంగా ఉండాలి.’ అని చెప్పాడు.