తెలంగాణ

telangana

ETV Bharat / sports

బోల్ట్‌ వారసులు వచ్చేస్తున్నారు! - రికార్డులు బద్దలయ్యేనా? - Next Usain Bolt - NEXT USAIN BOLT

Sprinter Usain Bolt : జమైకా చిరుత, పరుగులు వీరుడు ఉసేన్‌ బోల్ట్‌ రిటైరై ఏడేళ్లైనా పరుగులో అతడిలా ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు కనపడలేదు. ఇప్పటికీ బోల్ట్​ రికార్డులు భద్రంగానే ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓ ఇద్దరు టీనేజర్లు వయసుకు మించిన వేగంతో దూసుకొస్తున్నారు. భవిష్యత్​లో వీరు బోల్ట్​ రికార్డులను అందుకునే అవకాశం కనిపిస్తోంది. ఇంతకీ వారెవరంటే?

source Associated Press
Sprinter Usain Bolt (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : Aug 29, 2024, 9:57 AM IST

Sprinter Usain Bolt : 100 మీటర్ల పరుగు అనగానే టక్కున గుర్తొచ్చే పేరు జమైకా చిరుత, పరుగులు వీరుడు ఉసేన్‌ బోల్ట్‌. ఎందుకంటే అతడి సాధించిన రికార్డులు అలాంటివి. 200మీ.పరుగులోనూ ఎన్నో ఘనతలను తన ఖాతాలో వేసుకున్నాడు బోల్ట్​. తన పరుగుతో, హవభావాలతో స్ప్రింట్‌కు సూపర్​ క్రేజ్‌ను తీసుకొచ్చాడు. అతడు రిటైరై ఏడేళ్లైనా పరుగులో అతడిలా ఆధిపత్యం చెలాయించే మరో వీరుడు కనపడలేదు. ఇప్పటికీ బోల్ట్​ రికార్డులు భద్రంగానే ఉన్నాయి.

ఒలింపిక్స్‌ల్లో చిరస్మరణీయ ప్రదర్శన చేసిన బోల్ట్​, 2017 ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ తర్వాత పరుగుకు దూరమయ్యాడు. దీంతో ట్రాక్‌కు కళ తప్పింది. ఆ తర్వాత ఎంతో మంది స్ప్రింటర్లు వచ్చినా, ప్రపంచ ఛాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించినా, కానీ బోల్ట్‌లాగా మాత్రం ఆధిపత్యం చలాయించలేదు. ఇంకా 100మీ. (9.58సె), 200మీ. (19.19సె)లో ప్రపంచ రికార్డులు బోల్ట్‌వే.

అయితే ఇప్పుడు ఓ ఇద్దరు టీనేజర్లు వయసుకు మించిన వేగంతో దూసుకొస్తున్నారు. ట్రాక్​పై రయ్ రయ్​ ​మంటూ వస్తున్న వీళ్ల పరుగు చేస్తుంటే బోల్ట్‌ రికార్డులను బద్దలు కొట్టేలా కనిపిస్తున్నారు. వారే 14 ఏళ్ల బ్రిటిష్‌ స్ప్రింటర్‌ డివైన్‌ ఐహెం, 16 ఏళ్ల ఆస్ట్రేలియన్‌ అథ్లెట్‌ గౌట్​ గౌట్‌.

డివైన్​ ఐహెం(Divine Iheme Athletics 100M) - తాజాగా డివైన్​ ఐహెం ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన అండర్‌-14 పరుగు వీరుడిగా నిలిచాడు. లీ వ్యాలీ అథ్లెటిక్స్‌ కేంద్రంలో నిర్వహించిన 100మీ. పరుగు రేసులో 10.30 సెకన్లలో లక్ష్యాన్ని చేరాడు డివైన్. అనంతరం సచిన్‌ డెనిస్‌(జమైకా- 10.51సె) రికార్డును బ్రేక్ చేశాడు.

డివైన్ 12 ఏళ్ల వయసులోనే 11.30 సెకన్లలో రేసును పూర్తి చేశాడు. అతడి తల్లిదండ్రులు ఎంకిరుకా(తల్లి), ఇన్నోసెంట్‌(తండ్రి) నైజీరియాకు చెందిన వారు. వారు కూడా అథ్లెట్స్​. 2002 కామన్వెల్త్‌ క్రీడల్లో నైజీరియా తరఫున బరిలోకి దిగారు. స్ప్రింటర్‌ ఎంకిరుకానే ఆధ్వర్యంలోనే డివైన్‌ శిక్షణ తీసుకుంటున్నాడు. ఇంగ్లాండ్‌ ఆక్స్‌ఫర్డ్‌షైర్‌లో ఎంకిరుకానే పీడబ్ల్యూడీ అథ్లెటిక్స్‌ అకాడమీని రన్ చేస్తోంది.

యూరోపియన్‌ అండర్‌ - 18 ఆల్‌ టైమ్‌ పెర్​ఫార్మెన్స్​లో టెడ్డి విల్సన్‌ (10.26సె), జెఫ్‌ ఎరియస్‌ (10.27సె) తర్వాత మూడో స్థానం డివైన్‌ దే కావడం విశేషం.

గౌట్(Gout Gout Sprinter 100M)​ - ఈ 16 ఏళ్ల ఆస్ట్రేలియన్‌ అథ్లెట్‌ 2024 మార్చిలో క్వీన్స్‌లాండ్‌ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్స్‌ అండర్‌-18 100మీ. పరుగులో బరిలోకి దిగి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. 10.29సెకన్ల టైమింగ్​ను నమోదు చేసి రికార్డ్​ సృష్టించాడు.

గౌట్‌ ఫ్యామిలీ సూడాన్‌ నుంచి ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. అయితే గౌట్‌ చిన్నతనం నుంచే పరుగుపై ప్రేమను పెంచుకున్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో గౌట్​ ఆస్ట్రేలియా అండర్‌-20 100మీ. పరుగులో (10.48సె) ఛాంపియన్‌గా నిలిచాడు. 100తో పాటు 200మీ. (20.69సె) రేస్​లో నేషనల్ రికార్డ్స్​ గౌట్​ పేరు మీదే ఉండటం విశేషం.

అలా డివైన్, గౌట్‌ ఇద్దరు భవిష్యత్​లోనూ ఇలానే మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తే 2028 ఒలింపిక్స్‌లో పోటీపడే ఛాన్స్ ఉంది.

పారాలింపిక్స్​తో పారిస్ మళ్లీ మురిసే - 8 విమానాలతో ఎయిర్​ షో - విన్యాసాలు అదిరే! - Paris Paralympics 2024

పారిస్​ పారాలింపిక్స్‌ 2024 - భారత్‌ షెడ్యూల్‌ ఇదే - Paris Paralympics 2024

ABOUT THE AUTHOR

...view details