తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20కు రిటైర్మెంట్​ - మరి కోహ్లీ, రోహిత్​ నెక్ట్స్ ప్లాన్ ఏంటి? - Kohli Rohith T20 Retirement

Kohli Rohith T20 Retirement : టీ20 ఇంటర్నేషనల్​ క్రికెట్​కు భారత సీనియర్‌ ప్లేయర్లు కోహ్లీ, రోహిత్​ రిటైర్మెంట్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. యంగ్‌ ప్లేయర్లకు అవకాశం ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. మరి ఇప్పుడు వీళ్ల నెక్స్ట్‌ ప్లాన్‌ ఏంటి?

source ETV Bharat
Kohli Rohith (source ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 2, 2024, 6:56 PM IST

Kohli Rohith T20 Retirement :టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టైటిల్​ను టీమ్​ఇండియా దక్కించుకుంది. అయితే విజయం సాధించిన కాసేపటికే స్టార్‌ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఈ ఫార్మాట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించారు. మొదట విరాట్​ టీ20 ఇంటర్నేషనల్​ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించగా ఒక గంట తర్వాత, భారత కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆటకు వీడ్కోలు పలికాడు. యంగ్‌స్టర్‌లకు అవకాశం ఇచ్చే సమయం వచ్చిందని ఈ ఇద్దరు చెప్పారు. అనంతరం రవీంద్ర జడేజా కూడా సోషల్ మీడియా ద్వారా తన రిటైర్‌మెంట్‌ అనౌన్స్‌ చేశాడు. అయితే అందరి చర్చ కోహ్లీ, రోహిత్ గురించే. నెక్ట్స్​ ఏంటి అని?

  • ఇప్పుడే ఎందుకు రిటైర్ అయ్యారు?
    వాస్తవానికి, ఈ రిటైర్మెంట్‌లు ముందుగా ఊహించినవే. రోహిత్, కోహ్లీ, జడేజా సుదీర్ఘమైన, అద్భుతమైన కెరీర్‌ కలిగి ఉన్నారు. వారు టెస్ట్, వన్డేల్లో కూడా కీలక ఆటగాళ్ళు. ప్రస్తుతం చాలా కాలం తర్వాత ఇండియాకు టీ20 వరల్డ్‌ అప్‌ అందించారు. ఇక వారు టీ20ల్లో సాధించేందుకు పెద్దగా ఏమీ లేదు. అందులోనూ చాలా మంది యంగ్‌ ప్లేయర్‌లు టీ20 అరంగేట్రం కోసం ఎదురు చూస్తున్నారు. యువకులకు టీ20 ఇంటర్నేషనల్స్‌ అవకాశం ఇచ్చి, టెస్టులు, వన్డేలపై ఎక్కువ దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నారు.

  • టీ20లో భారత భవిష్యత్తు
    అంతర్జాతీయ టీ20ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ కోహ్లీ, రోహిత్​ టీ20 ఫ్రాంఛైజీ లీగ్‌లలో ఆడే అవకాశం ఉంది. అంటే దీనర్థం అభిమానులు ఇప్పటికీ వారిని ఐపీఎల్‌ లీగ్​లో చూడొచ్చు.
  • రోహిత్ శర్మ లక్ష్యాలు
    రోహిత్ శర్మ ఇకపై టెస్ట్ ఓపెనర్, జట్టుకు కెప్టెన్‌గా కొనసాగనున్నాడు. గత ఏడాది వన్డే వరల్డ్‌ కప్‌కు ఒక్క అడుగు దూరంలో నిలిచిపోయింది టీమ్​ఇండియా. ఇటీవల T20 విజయం అతడిలో కొత్త జోష్‌ వచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ, ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌ గెలవాలనే పట్టుదలను మరింత పెంచింది. కాబట్టి రోహిత్‌ తన సహచరులతో కలిసి మరికొంత కాలం ఈ ఫార్మాట్​లో కొనసాగుతాడు.
  • విరాట్ కోహ్లి ఏం చేస్తాడు?
    ఈ జనరేషన్‌లో బెస్ట్‌ బ్యాటర్‌గా నిలిచిన విరాట్ కోహ్లీ ఇంకా రాణించే అవకాశాలు ఉన్నాయి. వ్యక్తిగత రికార్డులు ఆకట్టుకునేలా ఉన్నప్పటికీ, కోహ్లీ ఇప్పుడు టీమ్‌ విజయానికి ఎక్కువ విలువ ఇస్తున్నాడు. ఆట పట్ల అతడికున్న ప్యాషన్‌, యువ ఆటగాళ్లకు మెంటార్‌గా అతని పాత్ర బలంగా ఉంది. కాబట్టి అతడు కూడా మరి కొంత కాలం టీమ్‌లో కీలక ప్లేయర్‌గా కొనసాగుతాడు.
  • రవీంద్ర జడేజా
    అసాధారణమైన ఫిట్‌నెస్, పర్సెటాలిటీ రవీంద్ర జడేజా సొంతం. జట్టులో కీలక ఆటగాడిగా కొనసాగనున్నాడు. అతడు తన అత్యుత్తమ ఫీల్డింగ్‌తో పాటు బ్యాట్, బాల్ రెండింటితో ఆటను ప్రభావితం చేయగలడు. జట్టుకు ఇంకొంత కాలం జడేజా అనుభవం, నైపుణ్యాలు కీలకం.


    టీ20 వరల్డ్​కప్​ 2026 - నేరుగా అర్హత సాధించిన 12 జట్లు ఇవే

ABOUT THE AUTHOR

...view details