Samantha Pickleball Game and Its Rules : హీరోయిన్ సమంత వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ఓ ఫ్రాంచైజీని కొనుగోలు చేయడంతో ఇప్పుడు చాలా మంది దాని గురించి చర్చించుకుంటున్నారు. పికిల్‌బాల్ గేమ్ అంటే ఏంటి? ఎలా ఆడతారు? దాని రూల్స్ ఎలా ఉంటాయి? అని తెలుసుకుంటున్నారు?
అమెరికాలో ప్రారంభం -ఈ పికిల్ బాల్ గేమ్ చూడటానికి టెన్నిస్, టేబుల్ టెన్నిస్, బ్యాడ్మింటన్‌ను పోలి ఉంటుంది. ఇది 1965లో అమెరికాలో ప్రారంభమవ్వగా ఇప్పుడిప్పుడే మన దగ్గర అడుగులేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ గేమ్ పెద్ద టోర్నీలు జరుగుతుంటాయి. ఇండోర్, అవుట్‌డోర్‌లోనూ దీనిని ఆడొచ్చు. సింగిల్స్‌లో ఇద్దరు, డబుల్స్‌లో నలుగురు ఆడతారు. మిక్స్డ్ డబుల్స్‌లోనూ కాంపిటీషన్స్ నిర్వహిస్తుంటారు. ఈ గేమ్‌ను ఆడేందుకు చెక్కతో చేసిన పాడిల్, హార్డ్ ప్లాస్టిక్ బాల్‌ను ఉపయోగిస్తారు.
రూల్స్ ఇవే - ఈ ఆటకు స్పెషల్ రూల్స్ ఉంటాయి. ఈ గేమ్ ఆడే కోర్టు 44 అడుగుల పొడవు, 20 అడుగుల వెడల్పు ఉంటుంది. నెట్ ఎత్తు కేవలం 36 అంగుళాలే. టెన్నిస్‌లో రెండు ఫాల్ట్‌లు చేస్తే సర్వీస్ పోయినట్టు కదా, కానీ పికిల్‌బాల్‌లో మాత్రం ఒక్క ఫాల్ట్ ఉంటుంది. డబుల్స్‌లో ఒకసారి మాత్రమే సర్వ్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఆట మొదలయ్యాక కనీసం ఒక్కసారైనా బంతి నేలపై బౌన్స్ అయితేనే షాట్ కొట్టాలి. ఆ తర్వాత డైరెక్ట్‌గా బంతిని కొట్టచ్చు.
ఈ పికిల్‌బాల్ గేమ్‌లో సర్వ్ చేసినప్పుడే పాయింట్లు లభిస్తాయి. ప్రతి సెట్ 11 పాయింట్లు అవ్వగానే ముగుస్తుంది. రెండు పాయింట్ల తేడాతో విన్నర్‌ను అనౌన్స్ చేస్తారు. టెన్నిస్‌లో లాగానే సర్వ్ చేసినప్పుడు లేదా గేమ్‌లో భాగంగా నెట్‌ను దాటిపోవాలి. ఇక సర్వ్ చేసేటప్పుడు నో వ్యాలీ జోన్ దగ్గర బాల్‌ను అందుకోకూడదు.