తెలంగాణ

telangana

ETV Bharat / sports

'మేం కష్టాల్లో ఉన్నప్పుడు, బాగా ఒత్తిడికి గురయ్యా - కోహ్లీ, హార్దిక్ కాపాడారు' - రోహిత్

మాజీ కెప్టెన్​ విరాట్ కోహ్లీపై ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ ప్రశంసలు!

Rohith Sharma Praises Kohli
Rohith Sharma Praises Kohli (source Associated Press)

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Rohith Sharma Praises Kohli : 'కోహ్లీ గోస్ డౌన్ ది గ్రౌండ్, కోహ్లీ గోస్ ఔట్ ఆఫ్ ది గ్రౌండ్' - అంటూ ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే 2022 టీ20 ప్రపంచ కప్‌ భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ సందర్భంగా చేసిన కామెంట్స్​ను క్రికెట్ ఫ్యాన్స్​ ఎప్పటికీ మర్చిపోలేరు. ఎందుకంటే ఆ మ్యాచ్​లో విరాట్ టీమ్ ఇండియాను గెలిపించిన తీరు అద్భుతం, అసాధారణం.

కోహ్లీ ఆడిన ఈ చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ మ్యాచ్​లో భారత్​ చేతిలో పాక్ చిత్తుగా ఓడింది. ఈ పోరులో 160 పరుగుల లక్ష్య ఛేదనలో 31/4తో కష్టాల్లోకి పడిపోయింది టీమ్ ఇండియా. అప్పుడు కోహ్లీ (53 బంతుల్లో 82 నాటౌట్; 6 ఫోర్లు, 4 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (37 బంతుల్లో 40; , 1 ఫోర్, 2 సిక్సర్)తో కలిసి ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. ఈ మ్యాచ్​ను గుర్తు చేసుకుంటూ ఐసీసీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. అందులో కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఆ మ్యాచ్ అనుభవాలను తెలిపారు.

"ఆ మ్యాచ్‌లో మేం కష్టాల్లో పడిపోయాం. నేను ఎంతో ఒత్తిడికి గురయ్యే వ్యక్తిని. దీంతో లైవ్ కూడా చూడకుండా డ్రెస్సింగ్ రూమ్‌లోనే కూర్చుండిపోయాను. కానీ కోహ్లీ - హార్దిక్ పాండ్య తమ ఆటతో మ్యాచ్‌ మలుపు తిప్పారు. ఆఖరి ఓవర్లలో బయటకు వచ్చి మ్యాచ్ చూసి, ఆ క్షణాల్ని ఆస్వాదించాను" - అని రోహిత్ శర్మ పేర్కొన్నాడు.

"మేం వికెట్లను త్వరగా పోగొట్టుకున్నాం. అప్పుడు మేం గెలిచే శాతం 2-3 అని విన్ ప్రిడిక్టర్ చూపించింది. కానీ విరాట్ గొప్ప ఇన్నింగ్స్, హార్దిక్‌తో భాగస్వామ్యం వల్ల విజయం సాధించాం. ఆ మ్యాచ్, ఆ విజయం అద్వితీయం. ఓ మై గాడ్" - సూర్యకుమార్ యాదవ్

ఈ పోరులో తొలుత బ్యాటింగ్​కు దిగిన​ పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లను కోల్పోయింది. 159 పరుగులు చేసింది. షాన్ మసూద్ (42 బంతుల్లో 52; 5 ఫోర్లు), ఇఫ్తికర్ అహ్మద్ (34 బంతుల్లో 51; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు బాదారు. ఛేదనలో కేఎల్ రాహుల్ (4), రోహిత్ శర్మ (4), సూర్యకుమార్ యాదవ్ (15), అక్షర్ పటేల్ (2) వరుసగా విఫలమయ్యారు. దీంతో 10 ఓవర్లకు భారత్ స్కోరు 45/4 మాత్రమే. ఆఖర్లో టీమ్ ఇండియా విజయానికి చివరి 18 బంతుల్లో 48 పరుగులు రావాలి. అప్పుడు విరాట్​ చెలరేగిన తీరు అసాధారణం అనే చెప్పాలి.

షాహిన్ అఫ్రిది బౌలింగ్‌లో విరాట్​ మూడు బౌండరీలు బాదడం వల్ల 17 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత హారీస్ రవూప్ 19వ ఓవర్​లో తొలి నాలుగు బంతులకు 3 పరుగులే వచ్చాయి. ఆ తర్వాత బౌన్సర్‌ బంతిని విరాట్​ ఓ వెనకడుగు వేసి బౌలర్ మీదుగా కళ్ళుచెదిరే సిక్సర్ కొట్టాడు. ఆ తర్వాత కూడా బాల్​ను సిక్సర్‌గా మలిచాడు. ఇక చివరి ఓవర్‌లో 16 పరుగులు అవసరమవ్వగా విరాట్​ మరో సిక్సర్ బాదగా, ఆఖరి బంతికి విన్నింగ్ షాట్‌ను అశ్విన్ ఆడాడు.

పుణెలో రివెంజ్​కు భారత్​ సిద్ధం!- కివీస్​తో రెండో టెస్ట్​ పిచ్ పరిస్థితేంటి? వర్షం ముప్పు ఉందా?

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ: భారత్ జట్టు ఎంపికపై ఉత్కంఠ- వాళ్లకు ఛాన్స్ దక్కేనా?

ABOUT THE AUTHOR

...view details