తెలంగాణ

telangana

ETV Bharat / sports

క్రికెట్ మానేసి డ్రామాల్లో నటించమని చెప్పండి!: యంగ్ ప్లేయర్​పై అక్రమ్ ఫైర్ - Wasim Akram On Abdullah Shafiq

Wasim Akram On Abdullah Shafiq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ ఆ దేశ యంగ్ ప్లేయర్ అబ్దుల్లా షఫిక్​కు చురకలు అంటించాడు.

Wasim Akram On Abdullah Shafiq
Wasim Akram On Abdullah Shafiq

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 10:36 AM IST

Updated : Mar 8, 2024, 1:41 PM IST

Wasim Akram On Abdullah Shafiq: పాకిస్థాన్ మాజీ క్రికెటర్ వసీమ్ అక్రమ్ తమ దేశ యంగ్ ప్లేయర్ అబ్దుల్లా షఫిక్​కు చురకలు అంటించాడు. అతడు క్రికెట్​ను వదిలి టీవీ నటుడుగా పనిచేసుకుంటే బాగుంటుందని అక్రమ్ అన్నాడు. అయితే పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్ 2024లో లాహోర్- ఇస్లామాబాద్​ మ్యాచ్​లో స్లిప్​లో ఫీల్డింగ్ చేస్తున్న షఫిక్ ఓ క్యాచ్ అందుకున్నాడు. అంతే ఇక తనను ట్రోల్ చేసే వారందరూ అందరూ నిశబ్దంగా ఉండాలి అనే విధంగా 'పెదాలపై వేలు వేసుకుంటూ' సెలబ్రేట్ చేసుకున్నాడు. అయితే షఫిక్ అందుకున్న క్యాచ్ అద్భుతమైనదేనని ఒప్పుకున్న అక్రమ్, కానీ ఆ విధంగా సెలబ్రేట్ చేసుకోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'షఫిక్ అందుకున్న క్యాచ్ గొప్పది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఆస్ట్రేలియా పర్యటనలో అతడు 36 క్యాచ్​లు నేలపాలుచేశాడు. మరి దాని సంగతేంటి? ప్రజలు అతడిపై చేస్తున్న విమర్శలు మానేసి మౌనంగా ఉండాలంటున్నాడు. అందుకే క్రికెట్ మానేసి డ్రామాల్లో నటించమని అతడికి చెప్పండి' అని అక్రమ్ ఓ స్పోర్ట్స్​ ఛానెల్ డిబెట్​లో అన్నాడు.

అయితే ఫామ్​లేమి కారణంగా షఫీక్ లాహోర్ జట్టులో స్థానం కూడా కోల్పోయాడు. ఈ మ్యాచ్​లో సబ్​సిట్యూట్ ఫీల్డర్​గా వచ్చాడు. ఈ సీజన్​లో అతడి ప్రదర్శన అంత చెప్పుకోదగ్గ విధంగా కూడా లేదు. షఫిక్​ ప్రస్తుత టోర్నీలో మూడు మ్యాచ్​ల్లో కలిపి చేసింది 45 పరుగులే. దీంతో అక్రమ్ చెప్పినట్లు షఫిక్ డ్రామాల్లో నటించడమే బెటర్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఇక ఇటీవల పాకిస్థాన్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. ఈ పర్యటనలో ఆతిథ్య జట్టుతో మూడు టెస్టు మ్యాచ్​ల సిరీస్ ఆడగా పాక్ అన్నింట్లోనూ ఘోరంగా ఓడింది. ఆల్​రౌండ్ ప్రదర్శన ఆసీస్ 3-0తో సిరీస్ నెగ్గింది.

ఇక పీఎస్​ఎల్ విషయానికొస్తే, సీజన్​ దాదాపు ముగింపు దశకు వచ్చేసింది. ప్రస్తుత టోర్నీలో ఇంకా 6 లీగ్ మ్యాచ్​లే మిగిలి ఉన్నాయి. ప్రస్తుతం ముల్తాన్ సుల్తాన్ 12 పాయింట్లతో టేబుల్ టాపర్​గా ఉండగా, లహోర్ 3 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. ఇక మార్చి 18న ఈ సీజన్ ఫైనల్​ మ్యాచ్ జరగనుంది.

48 ఏళ్ల వయసులో షోయబ్​కు ప్రమోషన్​- ఆడబిడ్డకు జన్మనిచ్చిన అక్తర్ భార్య

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు - ఖండించిన షోయబ్ మాలిక్​

Last Updated : Mar 8, 2024, 1:41 PM IST

ABOUT THE AUTHOR

...view details