తెలంగాణ

telangana

ETV Bharat / sports

పుణెలో సుందర్ మేజిక్- 1329 రోజుల తర్వాత కమ్​బ్యాక్ అదుర్స్

మూడున్నరేళ్ల తర్వాత సుందర్ రీఎంట్రీ- కమ్​బ్యాక్​తో అదరగొట్టిన స్పిన్నర్

Washington Sundar Comeback
Washington Sundar Comeback (Source: Associated Press)

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Washington Sundar Comeback :విమర్శించిన వాళ్లే వహ్వా అని పొగిడితే ఎలా ఉంటుంది? ఆ మజానే వేరు కదా? సరిగ్గా ఇప్పుడు టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ ఆల్‌ రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ పరిస్థితి అదే. అక్టోబరు 24న గురువారం పుణెలో న్యూజిలాండ్‌తో మొదలైన రెండో టెస్టుకు భారత్‌ జట్టులో కొన్ని మార్పులు చేసింది. రాహుల్‌, కుల్దీప్‌, సిరాజ్‌ని పక్కనపెట్టింది. వారి స్థానంలో శుభ్‌మన్‌ గిల్‌, వాషింగ్టన్‌ సుందర్‌, ఆకాష్‌ దీప్‌కి అవకాశం వచ్చింది.

అయితే మిగతా మార్పులు ఎలా ఉన్నా, వాషింగ్టన్‌ సుందర్‌ని టీమ్‌లోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు. మ్యాచ్‌ ప్రారంభానికే ముందే సుందర్‌ ఎంపికపై సోషల్‌ మీడియాలో విమర్శలు మొదలయ్యాయి. సుందర్‌ తన ప్రదర్శనతో ఈ విమర్శలకు చెక్ పెట్టాడు. తొలి ఇన్నింగ్స్​లో ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. దీంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా సుందర్ ట్రెండింగ్​లోకి వచ్చేశాడు.

కమ్​బ్యాక్ అదుర్స్​
దాదాపు 1300 రోజుల తర్వాత సుందర్ టెస్టుల్లో బరిలో దిగాడు. దీంతో రాక రాక వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. డ్రీమ్ కమ్​బ్యాక్ ఇచ్చాడు. మూడున్నరేళ్ల తర్వాత బరిలో దిగిన తొలి మ్యాచ్​లోనే బంతితో మేజిక్‌ చేశాడు. స్పిన్​కు అనుకూలించిన పిచ్​పై రెచ్చిపోయాడు. అతడి ధాటికి న్యూజిలాండ్ చివరి 7 వికెట్లు 62 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. 197-3 పటిష్ఠంగా ఉన్న కివీస్, 259 పరుగులకు ఆలౌటైంది. సుందర్ తొలి ఇన్నింగ్స్​లో 59 పరుగులు ఇచ్చి, 7 వికెట్లతో సత్తా చాటాడు. ఇందులో నాలుగు మెయిడెన్లు ఉన్నాయి.

కాగా, టెస్టుల్లో తన రీ ఎంట్రీ పట్ల సుందర్ మాట్లాడాడు. 'రోహిత్ భాయ్, గౌతీ భాయ్​కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. భారత్ తరపున టెస్టుల్లో రీ ఎంట్రీ ఇవ్వడం నమ్మలేని ఓ అనుభూతి' అని సుందర్ అన్నాడు.

విమర్శలు
కాగా, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్‌ని కాదని వాషింగ్టన్ సుందర్‌ని జట్టులోకి తీసుకోవడాన్ని చాలా మంది తప్పుబట్టారు. తొలి టెస్టులో వాషింగ్టన్ జట్టులో భాగం కాదు. భారత్ తొలి మ్యాచ్​లో ఓడిన తర్వాత అదనపు స్పిన్- బౌలింగ్ ఆప్షన్‌గా సుందర్‌కి అవకాశం ఇచ్చారు. వాషింగ్టన్ ప్రారంభంలో చాలా పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

కుప్పకూలిన కివీస్‌
బెంగళూరులో జరిగిన తొలి టెస్టులో టీమ్‌ఇండియా దారుణంగా విఫలమైంది. రెండో మ్యాచ్​ గెలవాలనే కసితో బరిలో దిగింది. ఫలితంగా తొలి రోజే న్యూజిలాండ్‌ని 259 పరుగులకే ఆలౌట్‌ చేసింది. పుణె పిచ్​పై భారత స్పిన్నర్లు సత్తా చాటారు. ప్రత్యర్థి జట్టు వికెట్లన్నీ స్పిన్నర్లే దక్కించుకోవడం విశేషం.

తిప్పేసిన సుందర్- కివీస్ 259 ఆలౌట్

న్యూజిలాండ్​తో రెండో టెస్ట్​ - WTCలో అశ్విన్‌ అదిరే రికార్డ్​

ABOUT THE AUTHOR

...view details