Virat Kohli 27000 Runs :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో మరో అరుదైన మైలురాయి అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో విరాట్ 27 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఈ ఘతన సాధించిన నాలుగో బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. అయితే అత్యంత వేగవంతంగా ఈ మైలురాయి అందుకుంది మాత్రం విరాట్ కోహ్లీనే. విరాట్ 594 ఇన్నింగ్స్‌ల్లో 27 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో దిగ్గజం సచిన్ తెందూల్కర్ (623 ఇన్నింగ్స్) రికార్డును బ్రేక్ చేశాడు. ఇక భారత్ నుంచి సచిన్ తర్వాత ఈ మైలురాయి అందుకున్న రెండో బ్యాటర్ విరాట్ కోహ్లీ. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ 47 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.
క్రికెటర్ | జట్టు | ఇన్నింగ్స్ | పరుగులు |
సచిన్ తెందూల్కర్ | భారత్ | 782 | 34357 |
కుమార సంగక్కర | శ్రీలంక | 666 | 28017 |
రికీ పాంటింగ్ | ఆస్ట్రేలియా | 668 | 27483 |
విరాట్ కోహ్లీ | భారత్ | 594 | 27012 |
కాగా, విరాట్ అంతర్జాతీయ కెరీర్లో టెస్టుల్లో 8918, వన్డేల్లో 13906,టీ20ల్లో 4188 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 80 సెంచరీలు నమోదు చేశాడు. అందులో టెస్టు (29), వన్డే (50), టీ20 (1) చేశాడు.
ఆ రికార్డుకూ చేరువలో
కాగా, టెస్టుల్లో విరాట్ 9 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు 82 రన్స్ కావాలి. ఈ ఫీట్ అందుకోవడం కూడా లాంఛనమే. దీంతో సుదీర్ఘ ఫార్మాట్ క్రికెట్లో 9 వేల పరుగుల మైలురాయి అందుకున్న నాలుగో భారత బ్యాటర్‌గానూ ఘనత సాధిస్తాడు. విరాట్ కంటే ముందు టీమ్ఇండియా నుంచి సునీల్ గావస్కర్, సచిన్ తెందూల్కర్, రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే 9 వేల పరుగులు పూర్తి చేశారు.