Virat Kohli RCB : ఐపీఎల్ 17లో భాగంగా జైపుర్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఉత్కంఠ పోరు జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ శతకం బాదినప్పటికీ ఆర్సీబీ జట్టు గెలవలేకపోయింది. జట్టులోని మిగతా బ్యాటర్స్ రాణించనప్పటికీ భారన్ని మొత్తం తన భుజాలపై మోసి ఇన్నింగ్స్‌ను చివరిదాకా నడిపించాడు నాటౌట్‌గా నిలిచాడు. అలా ఈ ఐపీఎల్‌లో తొలి సెంచరీ సాధించడమే కాకుండా, 5 మ్యాచ్‌లకే 316 పరుగులతో టాప్‌స్కోరర్‌గా కొనసాగుతున్నాడు విరాట్. దీంతో పాటు మరికొన్ని రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
- ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటి వరకు 8 సెంచరీలు చేశాడు. అత్యధిక సెంచరీల జాబితాలో టాప్ పొజిషన్లో ఉన్నాడు. ఇక విరాట్ తర్వాత జోస్ బట్లర్ (6), క్రిస్ గేల్ (6) ఈ లిస్ట్‌లో ఉన్నారు.
- ఐపీఎల్‌లో విరాట్ ఆడిన గత ఏడు ఇన్నింగ్స్‌ల్లో అతడికి ఇది మూడో సెంచరీ కావడం విశేషం.
- ఈ మ్యాచ్‌లో కోహ్లీ 113 పరుగులు స్కోర్ చేశాడు. ఈ స్కోర్‌తో ఐపీఎల్‌లో అతని అత్యధిక వ్యక్తిగత స్కోరును విరాట్ సమం చేశాడు. 2016లో పంజాబ్ జట్టుపై కోహ్లీ సరిగ్గా 113 రన్స్ సాధించాడు.
- ఐపీఎల్‌లో కోహ్లీ ఇప్పటివరకు 7579 పరుగులు చేశాడు. అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్ల లిస్ట్‌లో నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ స్టార్‌లో లీగ్‌లో 7500 మైల్‌స్టోన్‌ను దాటాడు. 234 ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఈ రికార్డు నమోదు చేశాడు. ఇదే లిస్ట్‌లో విరాట్ తర్వాత రెండో స్థానంలో ధావన్ (220 ఇన్నింగ్స్‌లో 6755 పరుగులు) ఉన్నాడు.
- ఐపీఎల్‌లో విరాట్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. 110 బంతులను క్యాచ్ చేసి, ఐపీఎల్‌లో అత్యథిక క్యాచ్‌లు పట్టిన నాన్ వికెట్ కీపర్‌గా రికార్డుకెక్కాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే - ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. రాజస్థాన్ టోర్నీలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. శనివారం జైపుర్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.