తెలంగాణ

telangana

ETV Bharat / sports

మనసులు గెలుకున్న కింగ్ కోహ్లీ - రింకూకు స్పెషల్ గిఫ్ట్​ - Virat Kohli Bat

Virat Kohli RCB Bat : ఐపీఎల్ 17వ సీజన్​లో భాగంగా మార్చి 29న కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు మధ్య ఉత్కంఠ మ్యాచ్ జరిగింది. అయితే ఈ పోరులో ఆర్సీబీ ఓటమి చవి చూసింది. కానీ ఆ జట్టు ప్లేయర్ విరాట్ కోహ్లీ మాత్రం క్రికెట్​ లవర్స్ మనసులను గెలుచుకున్నాడు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Mar 30, 2024, 8:24 PM IST

Virat Kohli RCB Bat : క్రికెట్‌ వరల్డ్‌లో సీనియర్లు, స్టార్‌ ప్లేయర్‌ల నుంచి యంగ్‌ క్రికెటర్లు స్పెషల్‌ గిఫ్ట్స్‌ అందుకుంటుంటారు. ఇలా విరాట్‌ కోహ్లి ఇప్పటి వరకు చాలా మందికి తన బ్యాట్‌ని బహుమతిగా ఇచ్చాడు. ఇప్పుడు ఈ లిస్టులో కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ ఆటగాడు రింకూ సింగ్‌ చేరాడు. బ్యాట్‌తో పాటు కోహ్లి విలువైన సూచనలు చేసినట్లు సమాచారం.

మార్చి 29న కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 59 బంతులకే 83 పరుగులు చేశాడు. కానీ దురదృష్టవశాత్తు రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఓటమిని చవి చూసింది. అయితే మ్యాచ్‌ ముగిసిన అనంతరం కోహ్లి, కేకేఆర్ ప్లేయర్ రింకు సింగ్​కు తాను సైన్ చేసిన ఓ స్పెషల్ బ్యాట్​ను అందజేశాడు. ఆ స్పెషల్ మూమెంట్​కు సంబంధించిన ఫొటోను కోల్​కతా ఫ్రాంచైజీ తమ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్​లో పోస్ట్ చేసింది. 'ద బాండ్‌ వీ లవ్‌ టూ సీ' అనే క్యాప్సన్‌ యాడ్‌ చేసింది. రింకూ కూడా బ్యాట్‌ ఇచ్చినందుకు విరాట్‌కి థ్యాంక్స్‌ చెబుతూ ఇన్‌స్టా స్టోరీ పోస్టు చేశాడు. ఇప్పుడు ఈ ఫొటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే - బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరిగిన పోరులో కోల్​కతా గెలుపొందింది. నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి గెలుపొందింది. శ్రేయస్ అయ్యర్​ (39), ఫిలిప్ సాల్ట్​ (30), సునీల్ నరైన్​(47) వెంకటేశ్ అయ్యర్ (50) స్కోర్ చేసి జట్టుకు కీలక పరుగులు అందించారు. అయితే తొలుత బ్యాటింగ్​కు దిగిన బెంగళూరు జట్టు కూడా దూకుడుగా ఆడింది. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 182 పరుగులు స్కోర్ చేసింది. స్టార్ క్రికెటర్ విరాట్‌ కోహ్లీ (83*) అలుపెరగని పోరాటం చేసి జట్టుకు కీలక ఇన్నింగ్స్ అందించగా, అదే జట్టుకు చెందిన కామెరూన్‌ గ్రీన్‌ (33), మాక్స్‌వెల్‌ (28), దినేశ్‌ కార్తీక్‌ (20) కూడా తమ ఆటతీరుతో సత్తా చాటారు. ఇక కోల్‌కతా బౌలర్లలో హర్షిత్‌ రాణా, ఆండ్రూ రస్సెల్‌ చెరో 2 వికెట్లు పడగొట్టగా, నరైన్‌ ఒక వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు.

ప్రస్తుతం ఆర్సీబీ ఆడిన మూడ్‌ మ్యాచ్‌లో ఒకటి మాత్రమే గెలిచింది. పాయింట్స్‌ టేబుల్‌లో ఆరో స్థానంలో ఉంది. కేకేఆర్‌ ఆడిన రెండు మ్యాచ్‌లు గెలిచి, రెండో స్థానంలో నిలిచింది. కోహ్లీ ఫామ్‌ కొనసాగించాలని, ఆర్సీబీ కప్పు గెలవాలని ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు. కేకేఆర్‌ అభిమానులు రింకూ సింగ్‌ నుంచి పవర్‌ఫుల్‌ ఇన్నింగ్స్‌ ఆశిస్తున్నారు.

ఆర్సీబీపై పేలుతున్న సెటైర్లు - ఈ ఫన్నీ మీమ్స్​ చూశారా? - IPL 2024 KKR VS RCB

ఆర్సీబీతో మ్యాచ్​ - నా సూపర్​ ఇన్నింగ్స్​కు కారణం ఆమెనే : వెంకటేశ్ అయ్యర్​ - IPL 2024 RCB VS KKR

ABOUT THE AUTHOR

...view details