Virat Kohli No Ball Controversy:రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నో బాల్ వివాదంపై అంపైర్లు క్లారిటీ ఇచ్చారు. అతడు ఆదివారం జరిగిన ఆర్సీబీ- కేకేఆర్ మ్యాచ్‌లో భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో హర్షిత్ రానా బౌలింగ్‌లో రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అయితే 'అది నో బాల్ కదా' అని విరాట్ రివ్యూ కోరేందుకు సిద్ధమయ్యాడు. కానీ, అంతలోపే ఫీల్డ్ అంపైర్, థర్డ్ అంపైర్‌కు సిఫార్సు చేశాడు. రిప్లై చూసిన థర్డ్ అంపైర్ కూడా దాన్ని ఔట్‌గా ప్రకటించాడు. దీంతో విరాట్ తీవ్ర అసహనంతో మైదానాన్ని వీడాడు.
అయితే దీనిపై థర్డ్ అంపైర్ స్పందించారు. బంతి బ్యాటర్ నడుం కంటే ఎత్తులో వెళ్తే దాన్ని నో బాల్‌గా ప్రకటిస్తారు. కానీ, ఆ బంతిని ఆడుతున్నప్పుడు బ్యాటర్ క్రీజు లోపల ఉండాలి. అయితే ఆదివారం నాటి మ్యాచ్‌లో విరాట్ క్రీజు బయటకు వచ్చి ఆ బంతిని ఆడాడు. దీంతో బంతి విరాట్ నడుం కంటే ఎత్తులో వచ్చినా ఔట్‌గా పెలివియన్ చేరాల్సి వచ్చింది. అయితే విరాట్ నడుం ఎత్తు 1.04 మీటర్లు కాగా, అతడు ఆడుతున్నప్పుడు బంతి 0.92 మీటర్ల ఎత్తులో వచ్చిందని అంపైర్ టెక్నాలజీ సాయంతో నిర్దారించారు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్ 7 బంతుల్లోనే 18 పరుగులు చేశాడు. అందులో రెండు సిక్స్‌లు, ఒక ఫోర్ ఉన్నాయి.
మ్యాచ్ తర్వాత కూడా: ఇక మ్యాచ్ ముగిసిన తర్వాత, తన ఔట్ వివాదంపై విరాట్‌కు అంపైర్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ప్రజెంటేషన్ తర్వాత విరాట్ డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్తుండగా అతడిని అంపైర్ ఆపాడు. ఈ తన ఔట్ గురించి విరాట్‌కు వివరించాడు. విరాట్- అంపైర్ మధ్య కాసేపు సంభాషణ సాగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.