Virat Kohli International Records:టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ బంగ్లాదేశ్ సిరీస్‌తో దాదాపు 9 నెలల విరామం తర్వాత టెస్టుల్లో బరిలో దిగనున్నాడు. అయితే ఈ సిరీస్‌లో క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డుపై విరాట్ కన్నేశాడు. ఈ నేపథ్యంలోనే విరాట్ కోహ్లీ వరల్డ్ రికార్డ్ బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. మరి అది ఏంటంటే?
35 ఏళ్ల విరాట్ కోహ్లీ ఇప్పటివరకు అంతర్జాతీయంగా 591 ఇన్నింగ్స్‌ల్లో 26942 పరుగులు చేశాడు. 27 వేల పరుగుల మైలురాయి అందుకునేందుకు విరాట్ మరో 58 రన్స్ దూరంలో ఉన్నాడు. ఈ క్రమంలో రానున్న బంగ్లా టెస్టు సిరీస్‌లో విరాట్ ఫీట్ సాధిస్తే, అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత వేగంగా 27వేల పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా నిలుస్తాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ (623 ఇన్నింగ్స్) పేరిట ఉంది. అయితే విరాట్ ఈ రికార్డు బ్రేక్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఇక గతంలోనూ 16,000, 17,000, 18,000, 19,000, 20,000, 21,000, 22,000, 23,000, 24,000, 25,000, 26,000 పరుగుల మైలురాళ్లను అత్యంత వేగంగా ఉందుకున్న రికార్డు సైతం విరాట్ పేరిటే ఉంది.
నాలుగో ప్లేయర్‌గా రికార్డు
విరాట్ ఈ ఫీట్ అందుకుంటే, ఇంటర్నేషనల్ క్రికెట్లో 27 వేల పరుగులు పూర్తి చేసిన నాలుగో బ్యాటర్‌గా నిలుస్తాడు. ఈ లిస్ట్‌లో సచిన్ తెందూల్కర్ (34357) టాప్‌లో ఉండగా కుమార సంగక్కర, రికీ పాంటింగ్ వరుసగా 2, 3 స్థానాల్లో ఉన్నారు.
సచిన్ తెందూల్కర్ | భారత్ | 782 | 34357 |
కుమర సంగక్కర | శ్రీలంక | 666 | 28017 |
రికీ పాంటింగ్ | ఆస్ట్రేలియా | 668 | 27483 |
విరాట్ కోహ్లీ | భారత్ | 591 | 26942 |