Virat Kohli IPL 2024: 2024 ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు శనివారం (ఏప్రిల్ 6) జైపుర్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో తలపడునుంది. ప్రస్తుత సీజన్లో హ్యాట్రిక్ విజయాలతో జోరుమీదున్న రాజస్థాన్ సొంత గడ్డపై మరో గెలుపు నమోదు చేయాలని ఊవ్విళ్లూరుతుండగా, ఈ మ్యాచ్‌తోనైనా మళ్లీ గెలుపు బాట పట్టాలని ఆర్సీబీ భావిస్తోంది. కాగా, ఈ సీజన్లో ఇప్పటివరకూ నాలుగు మ్యాచ్‌లు ఆడిన ఆర్సీబీ కేవలం ఒకే విజయం నమోదు చేసి, మూడింట్లో ఓడింది.
అయితే ఈ మ్యాచ్‌లో అందరి కళ్లూ ఆర్సీబీ స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీపైనే ఉండనున్నాయి. ఇప్పటికే నాలుగు మ్యాచ్‌ల్లో 203 పరుగులతో టాప్ రన్ స్కోరర్ లిస్ట్‌లో టాప్‌లో ఉన్నాడు. ఇక ఈ మ్యాచ్‌లోనూ విరాట్ రాణించాలని ఆర్సీబీ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విరాట్ ఈ మ్యాచ్‌లో పలు రికార్డులు అందుకునే ఛాన్స్ ఉంది. మరి కోహ్లీని ఊరిస్తున్న రికార్డులు ఏమిటంటే?
- ఐపీఎల్లో ఇప్పటివరకూ 241 మ్యాచ్‌లు ఆడిన విరాట్ 7466 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో 34 పరుగులు బాదితే ఐపీఎల్లో 7500 పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు సృష్టిస్తాడు. ఈ లిస్ట్‌లో విరాట్ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. 6755 పరుగులతో పంజాబ్ బ్యాటర్ శిఖర్ ధావన్ రెండో స్థానంలో ఉన్నాడు.
- ఈ మ్యాచ్‌లో విరాట్ 62 పరుగులు చేస్తే, రాజస్థాన్ రాయల్స్‌పై అత్యధిక పరుగులు బాదిన బ్యాటర్‌గా నిలుస్తాడు. అతడు ఇప్పటివరకూ రాజస్థాన్‌పై 29 మ్యాచ్‌ల్లో 618 పరుగులు చేశాడు. ఈ లిస్ట్‌లో పంజాబ్ కెప్టెన్ శిఖర్ ధావన్ (679 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు.
- ఐపీఎల్లో విరాట్ ఇప్పటివరకూ 242 సిక్స్‌లు బాదాడు. మరో 8 సిక్స్‌లు బాదితే ఐపీఎల్లో 250 సిక్స్‌లు పూర్తి చేసుకుంటాడు. అయితే విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడితే గాని 8 సిక్స్‌లు బాదడం సాధ్యం కాదు. ఇక స్టార్ బ్యాటర్లు క్రిస్ గేల్ (357), రోహిత్ శర్మ (261), ఏబీ డివిలియర్స్ (251) ముగ్గురే ఈ మార్క్ అందుకున్నారు.