తెలంగాణ

telangana

ETV Bharat / sports

కింగ్ కోహ్లి ఖాతాలో మరో ప్రతిష్టాత్మక ఐసీసీ అవార్డు - వీరాట్​ కోహ్లికి ఐసీసీ అవార్డు

Virat Kohli ICC Trophy : కింగ్​ విరాట్​ కోహ్లికి ఐసీసీ మెన్స్​ వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డ్​ వరించింది. 2023 ఏడాదికి గానూ అతడ్ని ఈ అవార్డుకు ఎంపిక చేసింది ఐసీసీ.

Player Of The Tournament At The ICC Men's Virat Kohli 2023
Virat Kohli ICC Trophy

By ETV Bharat Telugu Team

Published : Jan 25, 2024, 5:39 PM IST

Updated : Jan 25, 2024, 7:34 PM IST

Virat Kohli ICC Trophy : పరుగుల వీరుడు​ విరాట్​ కోహ్లికి ఐసీసీ మెన్స్​ వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డ్​ (ICC Mens ODI Cricketer of the Year-2023) వరించింది. 2023 ఏడాదికి గానూ అతడిని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపింది ఇంటర్నేషనల్​ క్రికెట్​ కౌన్సిల్​(ఐసీసీ). ఐసీసీ మెన్స్​ వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ కేటగిరీలో విరాట్​కు ఇది నాలుగో అవార్డు కావడం విశేషం. 2012, 2017, 2018, 2023 ఏడాదిల్లోనూ విరాట్​కు ఐసీసీ మెన్స్​ వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ అవార్డులు వరించాయి.

10వ ఐసీసీ అవార్డు
ప్రస్తుతం వచ్చిన తాజా అవార్డుతో విరాట్​ సరికొత్త రికార్డును సృష్టించాడు. ఇప్పటిదాకా మరే క్రికెటర్​కు సాధ్యంకాని మైలురాయిని అందుకున్నాడు. అదే తన కెరీర్​లో పది ఐసీసీ అవార్డులను సాధించడం. ఇందులో నాలుగు అవార్డులు ఐసీసీ మెన్స్​ వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ కేటగిరీలోనే వచ్చాయి.

విరాట్​కు ఆమడ దూరంలో
ఐసీసీ మెన్స్​ వన్డే క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​ విభాగంలో ఇప్పటివరకు 4 అవార్డులను సాధించిన విరాట్​ రికార్డ్​కు దరిదాపుల్లో మరే క్రికెటర్​ లేరు. మొత్తంగా ఇప్పటిదాకా 10 ఐసీసీ ట్రోఫీలను దక్కించుకున్న ఈ పరుగుల వీరుడు అత్యధిక ఐసీసీ టైటిల్స్​ను గెలిచిన ఆటగాళ్ల లిస్ట్​లో మొదటిస్థానంలో కొనసాగుతుండగా, రెండో స్థానంలో శ్రీలంక ప్లేయర్​ 4 అవార్డులతో కుమార సంగక్కర్​, టీమ్​ఇండియా మాజీ ప్లేయర్​ ఎంఎస్​ ధోనీ ఉన్నారు. క్రికెట్​ చరిత్రలోనే కనీసం 5 ఐసీసీ ట్రోఫీలను కూడా మరే ఆటగాడు ఇప్పటివరకు గెలవకపోవడం గమనార్హం.

టీ20లోనూ మనోడే
మరోవైపు ఐసీసీ అవార్డుల జాబితా-2023లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ పాట్‌ కమిన్స్‌ కూడా ఉన్నాడు. ఇతడికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డు లభించనుంది. అలాగే ఆసీస్​ మరో ఆటగాడు ఉస్మాన్‌ ఖవాజాకు కూడా 2023 ఏడాదికి గానూ ఐసీసీ అవార్డు దక్కింది. ఇతడు ఐసీసీ టెస్టు క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డుకు ఎంపికయ్యాడు. ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ అంపైర్ ఆఫ్‌ ది ఇయర్‌ అవార్డును ఐసీసీ నుంచి అందుకోనున్నాడు. టీమ్​ఇండియా నుంచి సూర్య కుమార్​ యాదవ్​ ఐసీసీ మెన్స్​ టీ20 క్రికెటర్​ ఆఫ్​ ది ఇయర్​-2023 అవార్డుకు సెలెక్ట్​ అయ్యాడు.

ఉప్పల్‌ టెస్ట్ : ముగిసిన తొలి రోజు ఆట

మ్యాచ్‌ మధ్యలో రోహిత్ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని!

Last Updated : Jan 25, 2024, 7:34 PM IST

ABOUT THE AUTHOR

...view details