USA VS CAN T20 World Cup : టీ20 ప్రపంచకప్లో భాగంగా ఆతిథ్య జట్లైన యూఎస్, కెనడా మధ్య జరిగిన పోరులో యూఎస్ జట్టు 197 పరుగులతో శుభారంభం చేసింది. కెనడా నిర్దేశించిన 195 పరుగుల టార్గెట్‌ను 17.4 ఓవర్లలోనే మూడు వికెట్లను మాత్రమే ఛేదించి గెలిచింది. అలా యూఎస్‌ఏ క్రికెట్ చరిత్రలో అతిపెద్ద విజయాన్ని సాధించింది. వరల్డ్ కప్ హిస్టరీలోనూ అత్యధిక టార్గెట్ మ్యాచుల్లోనూ ఇదే మూడోది.
యూఎస్ జట్టులో ఆరోన్ జోన్స్ 94 పరుగతో అజేయ స్కోర్ అందించాడు. ఇక అతడితో పాటు ఆండ్రీస్ గౌస్ కూడా 65 పరుగులతో జట్టుకు మంచి స్కోర్ అందించాడు. కెప్టెన్ మోనాంక్ పటేల్ 16 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. స్టీవన్ టైలర్ (0), కోరీ ఆండర్సన్ (3) నిరాశపరిచారు. ఇక కెనడా బౌలర్లలో కలీమ్ సనా, జెరీమీ గోర్డన్, నిఖిల్ దత్తా చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.
ఇదిలా ఉండగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్కు దిగిన కెనడా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 194 పరుగులు స్కోర్ చేసింది. ఓపెనర్ నవనీత్ ధాలివాల్ 61 పరుగులు చేయగా, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ నికోలస్ కిర్టన్ (51) కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. మిగతా ప్లేయర్లైన శ్రేయాస్ మొవ్వ (32), ఆరోన్ జాన్సన్ (23) కూడా తమ ఇన్నింగ్ల్లో ఫర్వాలేదనిపించారు. ఇక అమెరికా బౌలర్లలో అలీ ఖాన్, హర్మీత్ సింగ్, కోరె ఆండర్సన్ చెరో వికెట్ పడగొట్టారు.