Saurabh Netravalkar Love Story:2024 టీ20 వరల్డ్ కప్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్లేయర్స్‌లో యూఎస్‌ఏ క్రికెటర్ సౌరభ్ నేత్రవల్కర్ ఒకడు. ప్రతి పురుషుడి విజయం వెనక ఓ మహిళ ఉంటుందనే మాట, నేత్రవల్కర్ జీవితంలో నిజమైంది. ముంబయిలో జన్మించిన ఈ యూఎస్ క్రికెటర్ సక్సెస్‌లో అతడి భార్య దేవి స్నిగ్ధ ముప్పాల కీలక పాత్ర పోషించింది. ఆమె సహకారంతోనే స్టార్ క్రికెటర్ అమెరికా, భారతదేశంలో అనుకున్నది సాధించగలిగాడు.
సౌరభ్ భార్య ఎవరు?
దేవి స్నిగ్ధ ముప్పాల, ఆమె స్వతహాగా కెరీర్‌లో ఎంతో సాధించారు. ఆమె దేవి కార్నెల్ విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె భర్త సౌరభ్ పనిచేస్తున్న ఒరాకిల్ కంపెనీలోనే దేవి ప్రిన్సిపల్ అప్లికేషన్ ఇంజనీర్‌గా పని చేస్తున్నారు. అలానే ఆమె కథక్ డ్యాన్సర్. ఆమె నృత్యంపై ఉన్న ప్రేమతో యుఎస్‌లో బాలీవుడ్- ఇన్‌స్పైర్డ్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌ను క్రియేట్ చేశారు.
బాలీఎక్స్ సూపర్ సక్సెస్
దేవి క్రియేట్ చేసిన బాలీఎక్స్ డ్యాన్స్ ఫిట్‌నెస్ ప్రోగ్రామ్ చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా ABC 'షార్క్ ట్యాంక్'లో ప్రదర్శించిన తర్వాత ఎక్కువ మందికి రీచ్ అయింది. ఆమె ప్రోగ్రామ్ ఫిట్‌నెస్, బాలీవుడ్ డ్యాన్స్‌ను కంబైన్ చేస్తుంది. కాలిఫోర్నియాలోని శాన్ ఫ్రాన్సిస్కో బే ఏరియాలో హ్యూజ్ సక్సెస్ అయింది.