తెలంగాణ

telangana

ETV Bharat / sports

అండర్ -19 వరల్డ్ కప్​ : భారత్ - పాక్ మ్యాచ్ లోడింగ్! - భారత్ పాక్ ఫైనల్ మ్యాచ్

Under - 19 World Cup IND VS PAK : అండర్ 19 వరల్డ్ కప్​ 2024లో పాకిస్థాన్ సెమీఫైనల్​లో అడుగుపెట్టింది. దీంతో అభిమానులు భారత్ - పాక్ ఫైనల్ మ్యాచ్​ లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆ వివరాలు.

Etv Bharat
Etv Bharat

By ETV Bharat Telugu Team

Published : Feb 4, 2024, 11:00 AM IST

Under - 19 World Cup IND VS PAK : అండర్ 19 వరల్డ్ కప్​ 2024లో పాకిస్థాన్ సెమీఫైనల్​కు అర్హత సాధించింది. నాకౌట్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో థ్రిల్లింగ్​ విక్టరీని అందుకుంది. ఉత్కంఠగా సాగిన తమ ఆఖరి సూపర్ సిక్స్‌ మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో బంగ్లాదేశ్​ను ఓడించి సెమీస్​కు బెర్త్​ను ఖరారు చేసింది.

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్ 40.4 ఓవర్లలో 155 పరుగులకే ఆలౌట్ అయింది. అరఫత్ మిన్‌హాస్(40 బంతుల్లో 34; 4 ఫోర్లు, సిక్స్‌), షెహ్‌జైబ్ ఖాన్(67 బంతుల్లో 26; 3 ఫోర్లు) పర్వాలేదనిపించారు. బంగ్లా బౌలర్లలో రోహనత్, షేక్ జిబాన్ నాలుగేసి వికెట్లు పడగొట్టగా, రెహ్మాన్ రబ్బీ ఓ వికెట్ తీశాడు. అనంతరం లక్ష్యచేధనకు దిగిన బంగ్లాదేశ్ 35.5 ఓవర్లలో 150 పరుగులకే కుప్పకూలింది. మహమ్మద్ షిహాబ్ జేమ్స్(26), రోహనత్(21 నాటౌట్) రాణించారు. పాకిస్థాన్ బౌలర్లలో ఉబైద్ షా(5/44) ఐదు వికెట్లతో బంగ్లాపై విరుచుకుపడ్డాడు. తన బౌలింగ్​తో పాక్‌కు థ్రిల్లింగ్ విక్టరీని అందించాడు. అతడితో పాటు అలి రాజా మూడు వికెట్లు పడగొట్టగా, మహమ్మద్ జీషాన్ ఓ వికెట్ తీశాడు. ఇక ఈ విజయంతో పాక్​ నాలుగో జట్టుగా సెమీఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోగా ఇప్పటికే టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా సెమీస్ అర్హత సాధించాయి.

మంగళవారం(ఫిబ్రవరి 6) జరిగే తొలి సెమీ ఫైనల్లో టీమ్​ఇండియా - సౌతాఫ్రికా తలపడనున్నాయి. అనంతరం గురువారం జరిగే రెండో సెమీ ఫైనల్లో ఆస్ట్రేలియా పాకిస్థాన్ పోటిపడనున్నాయి. కాగా, గ్రూప్-1లో ఇప్పటికే టీమ్​ఇండియా, పాక్ నాలుగింటికి నాలుగు మ్యాచ్‌లు గెలిచి జోరు మీదున్నాయి. గ్రూప్-2లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా మూడేసి మ్యాచ్‌ల్లో గెలిచాయి. ఆస్ట్రేలియా, వెస్టిండీస్ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా క్యాన్సిల్ అయిపోయింది. సో సెమీస్​లో ఆస్ట్రేలియాపై పాకిస్థాన్, దక్షిణాఫ్రికాపై టీమ్​ఇండియా విజయం సాధిస్తే ఫైనల్​లో భారత్​ - పాక్​ తలపడొచ్చు. దీంతో భారత్ - పాక్ ఫైనల్ మ్యాచ్​ లోడింగ్ అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

బుమ్రా బౌలింగ్​ దెబ్బ - బ్యాట్‌ కిందపడేసిన బెన్‌స్టోక్స్‌
రఫ్పాడించిన బుమ్రా- ఇంగ్లాండ్ 253 ఆలౌట్- 171 రన్స్​ లీడ్​లో భారత్

ABOUT THE AUTHOR

...view details