తెలంగాణ

telangana

ETV Bharat / sports

రోహిత్ విరాట్ కాకుండా ఈ ఏడాది క్రికెట్​కు వీడ్కోలు పలికిన ప్లేయర్లు ఎవరంటే? - CRICKETERS WHO RETIRED IN 2024

రోహిత్, విరాట్ కాకుండా ఈ ఏడాది ఎంత మంది క్రికెటర్లు రిటైర్ అయ్యారో తెలుసా?

Cricketers Who Retired In 2024
Cricketers Who Retired In 2024 (ETV Bharat)

By ETV Bharat Sports Team

Published : Dec 19, 2024, 7:51 PM IST

Cricketers Who Retired In 2024 : ఈ ఏడాది చాలా మంది క్రికెట్‌ అభిమానుల హార్ట్‌ బ్రేక్‌ అయింది. చాలా మంది స్టార్‌ ప్లేయర్‌లు వివిధ ఫార్మాట్‌లకి రిటైర్మెంట్‌ ప్రకటించారు. తాజాగా సీనియర్‌ స్పిన్నర్‌ అశ్విన్‌ అంతర్జాతీయ క్రికెట్‌కి పూర్తిగా దూరమవుతున్నట్లు ప్రకటించాడు. ఈ ఏడాది ఈ నిర్ణయం తీసుకుంది అశ్విన్‌ ఒక్కడే కాదు. ఈ లిస్టులో జేమ్స్ ఆండర్సన్, శిఖర్ ధావన్, దినేశ్​ కార్తీక్, టిమ్ సౌథీ సహా చాలా మంది టాప్ ప్లేయర్‌లు ఉన్నారు. వీరు కాకుండా ఈ ఏడాది ఏయే ప్లేయర్లు రిటైర్మెంట్ ప్రకటించారంటే?

డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)
ఈ ఏడాది మొదటి రిటైర్మెంట్ ప్రకటించిన క్రికెటర్​ డేవిడ్ వార్నర్. సిడ్నీలో పాకిస్థాన్‌తో చివరి టెస్టు ఆడిన తర్వాత కెరీర్‌కు ముగింపు పలికాడు. అతడు చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ భారత్‌తో జరిగిన టీ20 ప్రపంచకప్‌. వార్నర్ వన్డేల్లో 6,932, టీ20ల్లో 3,277, టెస్టుల్లో 8,786 సహా 18,995 పరుగులు చేశాడు. అన్ని ఫార్మాట్‌లలో ఆస్ట్రేలియా తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రిటైరయ్యాడు.

రోహిత్ శర్మ (భారత్)
టీమ్‌ఇండియాకి టెస్టులు, వన్డేల్లో రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 2024 టీ20 ప్రపంచ కప్‌ గెలిచాక, పొట్టి ఫార్మాట్‌కి రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. అతడు 159 అంతర్జాతీయ టీ20ల్లో 4,231 పరుగులు చేశాడు. ఆ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రోహిత్‌ పేరిటే ఉంది.

విరాట్ కోహ్లీ (భారత్)
2024 టీ20 ప్రపంచ కప్ విజయం తర్వాత విరాట్ కోహ్లి కూడా రిటైర్‌మెంట్‌ ఇచ్చేశాడు. టెస్టు, వన్డేల్లో కొనసాగుతున్నాడు. కోహ్లీ టీ20ల్లో 125 మ్యాచుల్లో 4,188 పరుగులు చేశాడు.

దినేశ్​ కార్తీక్ (భారత్)
దినేశ్​ కార్తీక్ 2024 జూన్ 1న అన్ని ఫార్మాట్‌ల నుంచి రిటైర్ అయ్యాడు. కార్తీక్ దాదాపు రెండు దశాబ్దాల కెరీర్‌లో 26 టెస్టులు, 94 వన్డేలు, 60 టీ20లు ఆడాడు. మూడు ఫార్మాట్‌లలో వరుసగా 1025, 1752, 686 పరుగులు చేశాడు.

హెన్రిచ్ క్లాసెన్ (దక్షిణాఫ్రికా)
హెన్రిచ్ క్లాసెన్ 2024 జనవరిలో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. వికెట్ కీపర్-బ్యాటర్ కెరీర్‌లో కేవలం నాలుగు టెస్టులు ఆడాడు. 104 పరుగులు చేశాడు. వన్డేలు, టీ20ల్లో కొనసాగుతున్నాడు.

షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)
బంగ్లాదేశ్ ఆల్-రౌండర్ షకీబ్ అల్ హసన్ 2024లో T20Iల నుంచి రిటైర్ అయ్యాడు. మొత్తం 129 మ్యాచుల్లో 2551 పరుగులు చేశాడు. అలానే 149 వికెట్లు తీశాడు.

రవీంద్ర జడేజా (భారత్)
టీ20 ప్రపంచకప్‌లో భారత్‌ విజయం తర్వాత రవీంద్ర జడేజా కూడా ఈ ఫార్మాట్‌కి దూరమయ్యాడు. అతడు టీ20ల్లో 74 మ్యాచుల్లో 54 వికెట్లు పడగొట్టాడు, 515 పరుగులు చేశాడు. జడేజా టెస్టులు, వన్డేలు ఆడుతున్నాడు.

రవిచంద్రన్ అశ్విన్ (భారత్)
తాజాగా రవిచంద్రన్ అశ్విన్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరయ్యాడు. అశ్విన్‌ టెస్టుల్లో 106 మ్యాచుల్లో 537 వికెట్లు తీశాడు. 116 వన్డేల్లో 156, 65 టీ20ల్లో 72 వికెట్లు పడగొట్టాడు. టెస్టుల్లో అశ్విన్‌ 3503 పరుగులు కూడా చేశాడు. ఇందులో 15 హాఫ్‌ సెంచరీలు, 6 సెంచరీలు ఉన్నాయి.

టిమ్ సౌథీ (న్యూజిలాండ్)
2024 డిసెంబర్‌లో ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్ తర్వాత టిమ్ సౌథీ రిటైరయ్యాడు. సౌథీ టెస్టుల్లో 391 సహా అన్ని ఫార్మాట్‌లలో 770 వికెట్లు పడగొట్టాడు, రిచర్డ్ హ్యాడ్లీ తర్వాత న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలిచాడు.

జేమ్స్ ఆండర్సన్ (ఇంగ్లండ్)
జేమ్స్ ఆండర్సన్ 2024 జూలైలో క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. అతడు 188 టెస్టుల్లో 704 టెస్ట్ వికెట్లు తీశాడు. అత్యధిక వికెట్లు తీసిన ఇంగ్లండ్‌ బౌలర్‌గా నిలిచాడు. మొత్తం మీద టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన మూడో ప్లేయర్‌ అయ్యాడు.

నీల్ వాగ్నర్ (న్యూజిలాండ్)
న్యూజిలాండ్ తరపున 64 టెస్టులు ఆడిన తర్వాత నీల్ వాగ్నర్ 2024 ఫిబ్రవరిలో రిటైరయ్యాడు. వాగ్నర్ 52.7 స్ట్రైక్ రేట్‌తో 260 టెస్ట్ వికెట్లు తీశాడు.

'బ్యాటర్​గా ఎంట్రీ ఇచ్చి- 500 వికెట్లతో టాప్​ 2బౌలర్​గా ఎదిగాడు'- అశ్విన్ జర్నీపై మాజీ క్రికెటర్

టెస్ట్​ క్రికెట్​లో బుమ్రా తగ్గేదే లే! - 2024లో అత్యధిక వికెట్లు తీసిన టాప్‌ 10 బౌలర్లు ఎవరంటే?

ABOUT THE AUTHOR

...view details