Tilak Varma T20 Records :చెన్నై చిదంబరం స్డేడియం వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమ్ఇండియా యంగ్ బ్యాటర్ తిలక్ వర్మ సూపర్ హాఫ్ సెంచరీతో ఒంటిచేతితో విజయాన్ని అందించాడు. 72 పరుగులు బాది కష్టాల్లో ఉన్న జట్టును నుంచి విజయతీరాలను తీర్చాడు. ఈ క్రమంలో తిలక్ వర్మ, సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేశాడు.
విరాట్ రికార్డు బ్రేక్
భారత్ తరఫున వరుసగా నాలుగు టీ20ల్లో కలిపి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా తిలక్ వర్మ నిలిచాడు. 4 ఇన్నింగ్స్‌లో కలిపి తిలక్ 318 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమ్ఇండియా రన్ మెషీన్ కోహ్లీ (258 పరుగులు)ని అధిగమించాడు. ఈ జాబితాలో సంజూ శాంసన్ (257 పరుగులు), రోహిత్ శర్మ (253 పరుగులు), శిఖర్ ధావన్ (252 పరుగులు) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ప్రపంచ రికార్డు బ్రేక్!
తాజా ఇన్నింగ్స్‌తో తిలక్ వరల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా తిలక్ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో నాటౌట్‌గా 72 పరుగులు బాదిన తిలక్, ఇంతకుముందు మూడు ఇన్నింగ్స్‌ల్లో 107*, 120*, 19*, 72* రన్స్ చేశాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్ బ్యాటర్ మార్క్ చాప్మన్ (271 రన్స్)ను అధిగమించాడు.