Virat Kohli Sun Glasses Price :టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ కోహ్లీ బ్యాటింగ్‌కే కాదు ఫ్యాషన్‌కు కూడా అభిమానులు ఉన్నారు. మైదానంలో ఉన్నా లేదా బయట కనిపించినా విరాట్ స్టైలిష్‌గా కనిపిస్తాడు. ముఖ్యంగా కోహ్లీ ధరించే సన్‌గ్లాసెస్ అదనపు ఆకర్షణ తీసుకొస్తాయి. అయితే విరాట్ ఎక్కువగా టాప్ బ్రాండ్ ఓక్లీకి చెందిన స్పోర్ట్స్ సన్‌గ్లాసెస్ ధరిస్తుంటాడు. ఓక్లీ స్టైల్‌కు మాత్రమే కాకుండా అధిక పనితీరు, మన్నికకు ప్రసిద్ధి చెందాయి. అయితే కోహ్లీ ఇంటర్నేషనల్ మ్యాచులలో తరచుగా ధరించే కొన్ని ఓక్లీ మోడల్స్, వాటి ధర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- ఓక్లీ రాడార్ ఈవీ పాత్ (Oakley Radar EV Path)
కోహ్లీ ధరించే సాధారణ ఓక్లీ మోడళ్లలో ఒకటి ఓక్లీ రాడార్ ఈవీ పాత్. ఈ సన్ గ్లాసెస్ అథ్లెట్ల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. సూర్యుని నుంచి రక్షణను కల్పించే అడ్వాన్స్‌డ్ డ్యూయల్-లెన్స్ టెక్నాలజీతో రూపొందించారు. రాడార్ ఈవీ పాత్ సన్ గ్లాసెస్ ధర సాధారణంగా $200 (దాదాపు రూ.16,795) నుంచి ప్రారంభమవుతుంది. మీరు పోలరైజ్డ్ లెన్స్‌లు (గ్లేర్‌ని తగ్గించేవి) వంటి అదనపు ఫీచర్‌లు కోరుకుంటే ధర సుమారు $300 లేదా అంతకంటే ఎక్కువ ఉండవచ్చు. కస్టమ్ డిజైన్‌లతో వచ్చే స్పెషల్ ఎడిషన్స్ ధర ఇంకా ఎక్కువగా ఉంటుంది.
- ఓక్లీ ఎం2 ఫ్రేమ్ ఎక్స్‌ఎల్ షీల్డ్ (Oakley M2 Frame XL Shield)