Virat Kohli Expensive Watches:టీమ్ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ప్రపంచంలోనే అత్యధిక ఆదాయాన్ని ఆర్జించే ఆటగాళ్లలో ఒకడు. బ్యాటింగ్‌లో ఎన్నో రికార్డులు సృష్టించిన విరాట్‌కు వేల కోట్ల రూపాయల ఆస్తులు కూడా ఉన్నాయి. విలాసవంతమైన ఇల్లు, కార్లు కూడా ఉన్నాయి. అయితే విలాసవంతమైన జీవితాన్ని గడిపే విరాట్‌కు లగ్జరీ చేతి గడియారాలు ధరిచడమంటే కూడా చాలా ఇష్టం. అందుకే కోహ్లీ దగ్గర అత్యంత ఖరీదైన చేతి గడియారాలు ఉన్నాయి. వాటి ధర తెలిస్తే మతి పోవాల్సిందే! ఆ వాచ్‌ల ధర లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు ఉంటుంది. వాటి గురించే ఈ కథనం.
కోహ్లీ దగ్గరున్న ఖరీదైన పది వాచ్‌లు ఇవే
- కోహ్లీ దగ్గర ఐస్ బ్లూ డయల్, బ్రౌన్ సిరామిక్ బెజెల్‌తో ఉన్న ప్లాటినం రోలెక్స్ డేటోనా వాచ్ కూడా ఉంది. దీని ధర రూ 1.23 కోట్లు
- కోహ్లీ దగ్గర ఉన్న మరో ఖరీదైన వాచ్ ప్లాటినం పాటెక్ ఫిలిప్ గ్రాండ్ కాంప్లికేషన్. దీని విలువ రూ. 2.6 కోట్లు.
- విరాట్ దగ్గర ఉన్న మరో లగ్జరీ వాచ్ పటేక్ ఫిలిప్ నాటిలస్. దీని ధర రూ. 1.14 కోట్లు.
- ఈ స్టార్ క్రికెటర్ దగ్గర ఉన్న మరో వాచ్ రోలెక్స్ ఓయిస్టర్ స్కై డ్వెల్లర్ కూడా ఉంది. దీని ధర: రూ. 1.8 కోట్లు.
- కోహ్లీ దగ్గర ఉన్న మరో విలాసవంతమైన వాచ్ రోలెక్స్ డేటోనా వైట్ డయల్. దీని ధర: రూ. 3.2 కోట్లు.
- విరాట్ దగ్గర ఉన్న మరో లగ్జరీ వాచ్ ఆడెమర్స్ పిగెట్ రాయల్ ఓక్ డబుల్ బ్యాలెన్స్ వీల్. దీని ధర: రూ. 1.2 కోట్లు
- విరాట్ దగ్గర ఉన్న మరో వాచ్ 18KT గోల్డ్ రోలెక్స్ డేటోనా గ్రీన్ డయల్. దీని ధర రూ. 1.1 కోట్లు.
- మరో లగ్జరీ వాచ్ రోలెక్స్ డే-డేట్ రోజ్ గోల్డ్ ఆలివ్ డయల్ కూడా ఉంది. దీని ధర: రూ. 57 లక్షలు
- కోహ్లీ వాచ్ కలెక్షన్లో స్కెలిటన్ కాన్సెప్ట్ రోలెక్స్ ఉంది. దీని ధర రూ. 86 లక్షలు
- ఇక చివరగా రోలెక్స్ డేటోనా - కోహ్లీ దగ్గర ఉన్న గడియారాల్లో ఇదే అత్యధిక ధర కలిగిన వాచ్. దీని ధర సుమారు రూ. 4.6 కోట్లు.