TeamIndia Squad for SriLanka 2024 :జులై 27 నుంచి భారత్, శ్రీలంక మధ్య 3 టీ20, 3 వన్డే మ్యాచ్ సిరీస్‌లు జరగనున్నాయి. శ్రీలంకలో జరగనున్న ఈ సిరీస్ కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ . కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జట్టు ఎంపికపై సుదీర్ సమాలోచనలు జరిపిన తర్వాత జట్టును అనౌన్స్ చేశారు. అయితే ఈ సిరీస్‌కు రోహిత్ శర్మ వన్డేలకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో అతడికే వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. టీ20లకు రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించడంతో సూర్యకుమార్ యాదవ్‌ను టీ20 టీమ్‌లకు సారథిగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఈసారి జట్టులో ఎక్కువగా యంగ్ ప్లేయర్స్‌కు అవకాశం కల్పించారు.
టీ20 జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హుబ్మాన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), సంజు శాంసన్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయి, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్.
వన్డే జట్టు: రోహిత్(కెప్టెన్), గిల్(వైస్ కెప్టెన్), కోహ్లీ, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రిషభ్(వికెట్ కీపర్), శ్రేయస్, శివమ్, కల్దీప్, సిరాజ్, వాషింగ్టన్, అర్ష్‌దీప్, రియాన్, అక్షర్, ఖలీల్, హర్షిత్ రాణా