తెలంగాణ

telangana

ETV Bharat / sports

WTC ఫైనల్స్​కు టీమ్ఇండియా! - మూడో టెస్ట్ ఓడితే ఇక కష్టమే!

WTC పాయింట్ల పట్టికలో 73 నుంచి 62.82కి పడిపోయిన టీమ్ఇండియా - మూడో టెస్ట్ ఓడితే ఇక కష్టమే!

WTC 2025 Team India
WTC 2025 Team India (Associated Press)

By ETV Bharat Sports Team

Published : Oct 30, 2024, 6:57 AM IST

WTC 2025 Team India :ఇప్పటివరకూ జరిగిన రెండు ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్స్‌ (డబ్ల్యూటీసీ)లోనూ అలవోకగా ఫైనల్​కు చేరుకుంది టీమ్ఇండియా. టైటిల్‌ గెలవకపోయినప్పటికీ వరుసగా రెండుసార్లు ఫైనల్‌ చేరిన ఘనతను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఇదే ఊపులో మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌ చేరాలని ఆశిస్తోంది. అయితే ఇంతలోనే భారత్‌కు న్యూజిలాండ్‌కు పెద్ద షాకే ఇచ్చింది.

సొంతగడ్డపై వరుసగా రెండు మ్యాచ్‌ల్లో కివీస్ చేతిలో ఓటమిపాలవ్వడం భారత్‌ అవకాశాలపై ప్రభావం చూపింది. అయినప్పటికీ సిరీస్‌కు ముందు నుంచే 73 గెలుపు శాతంతో అగ్రస్థానంలో, అలాగే మిగతా జట్లకు అందని స్థాయిలో ఉంది టీమ్‌ఇండియా. రెండు పరాజయాల తర్వాత కూడా నంబర్‌వన్‌ పొజిషన్​లోనే కొనసాగుతోంది. కానీ గెలుపు శాతం మాత్రం 62.82కి పడిపోయింది.

మరోవైపు ముంబయిలో శుక్రవారం నుంచి జరగనున్న మూడో టెస్టులోనూ టీమ్ఇండియా ఓడితే ఇక డబ్ల్యూటీసీ ఫైనల్‌ ఆశలు గల్లంతయినట్లే అని క్రికెట్ విశ్లేషకుల మాట. అగ్రస్థానాన్ని కోల్పోవడమే కాకుండా పట్టికలో కొంచెం కిందికి పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయట.

అయితే ఈ టెస్ట్ సిరీస్​ తర్వాత రాబోయేది కఠినమైన ఆస్ట్రేలియా పర్యటన. అందులోనూ నాలుగు టెస్టులు గెలిస్తే తప్ప ఫైనల్‌ చేరే పరిస్థితి ఎదురు కావచ్చు. వరుస విజయాలు సాధిస్తున్న సౌతాఫ్రికా, రానున్న మ్యాచుల్లో భారత్‌కు గట్టి పోటీనివ్వనుంది. కానీ ఆస్ట్రేలియాలో ఫలితం ఎలా ఉన్నా కూడా ముందు ఈ కివీస్‌ టెస్ట్​లో గెలవడం భారత్‌కు చాలా అవసరమని క్రీజా విశ్లేషకుల అభిప్రాయం.

ఇదిలా ఉండగా, రానున్న మూడో టెస్ట్​ మ్యాచ్​కు భారత తుది జట్టులో మరోసారి మార్పులు చేయాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఇంగ్లీష్ స్పోర్ట్స్​ మీడియాల్లో కథనాలు కూడా వచ్చాయి. రెండో టెస్టులోనూ మూడు మార్పులతో(రాహుల్, కుల్‌దీప్‌, సిరాజ్‌ స్థానాల్లో గిల్, సుందర్, ఆకాశ్‌) బరిలోకి దిగిన టీమ్ ఇండియాకు ఓటమి మాత్రం తప్పలేదు. దీంతో ఇప్పుడు కాన్ని మార్పులు చేయనుందట. మహ్మద్ సిరాజ్​, ధ్రువ్‌ జురెల్​ అక్షర్ పటేల్​ను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రవీంద్ర జడేజా, రిషబ్ పంత్​కు విశ్రాంతినివ్వాలనుకుంటోందట.

వరుస పరాజయాల వేళ టీమ్ ఇండియా కీలక నిర్ణయం - జట్టులోకి యంగ్ స్టార్ పేసర్

సీనియర్లపై గంభీర్ స్ట్రిక్ట్​ యాక్షన్​ - 'ఇకపై ప్రాక్టీస్​కు వారు కూడా రావాల్సిందే'

ABOUT THE AUTHOR

...view details